వణుకు పుట్టించే దోస్తీ ఇది.. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా?
ఇటీవల ఏర్పడిన రెండు దేశాల మధ్య దోస్తీ ఏకంగా ప్రపంచ వినాశనానికి కారణమవుతుందా అనే ఆందోళన అందరిలో కలుగుతుంది... ఇదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం ఖాయమంటూ ఎంతోమంది నిపుణులు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఇలా ప్రస్తుతం కొత్తగా దోస్తీ ఏర్పాటు చేసుకున్న దేశాలు ఏవో తెలుసా.. రష్యా, ఉత్తరకొరియా. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ సంపత్తి కలిగిన దేశంగా కొనసాగుతుంది రష్యా. ఏకంగా పాశ్చాత్య దేశాలకు ముచ్చమటలు పట్టించే నేతగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కొనసాగుతున్నారు. మరోవైపు నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదు అనే రీతిలో ప్రపంచ దేశాలను పక్కనపెట్టి నియంత్రణ పాలనతో ప్రపంచాన్ని నివ్వేర పోయేలా చేసి మరొకరు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.
అయితే ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ మాట వినని చిన్న దేశాలపై ఆయుధాలతో విరుచుకుపడుతూ యుద్ధం చేస్తున్నారు. మరోవైపు కిమ్ ఏకంగా ఎప్పటికప్పుడు మిస్సైల్స్ ప్రయోగం చేస్తున్నారు అమెరికా లాంటి అగ్రదేశాలు హెచ్చరిస్తున్న వెనకడుగు వేయడం లేదు అయితే ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు దోస్తీ కుదిరింది. బాయ్ బాయ్ అంటూ కలిసి తిరగడం ప్రపంచ దేశాలను భయపెడుతుంది. మరి ముఖ్యంగా అగ్ర దేశమైన అమెరికాలో ఆందోళనకు కారణం అవుతుంది అమెరికాకు చెక్ పెట్టాలని వీరు సైనిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే వీరి దోస్తే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే విషయంపై ఆందోళన చెందుతున్నారు ఎంతో నిపుణులు.