ప్రతి ఒక్కరు నవ్వాల్సిందే.. జపాన్ లో కొత్త చట్టం?
సాధారణంగా నవ్వు నాలుగు విధాలుగా చేటు చేస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ అదే నవ్వు అటు మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది అన్న విషయం నిపుణులు చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు కొంత సమయమైనా నవ్వుతూ ఉల్లాసంగా ఉండాలని అలా అయితే అనారోగ్య సమస్యలు ఏవి దరి చేరవు అని చెబుతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం బిజీ ప్రపంచంలో ఎవరికీ కూడా అసలు నవ్వడానికి సమయం లేకుండా పోయింది. ఎందుకంటే బిజీ ప్రపంచంలో మనీ గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఇక ఇలా కాసేపైనా హాయిగా నవ్వుకుందామని ఎవరు ఆలోచించడం లేదు.
ఇలాంటి సమయంలో ఏకంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా నవ్వాల్సిందే అని ఏకంగా ప్రభుత్వమే ఒక చట్టం తీసుకొస్తే ఎలా ఉంటుంది.. ఊరుకోండి బాసూ నవ్వడం కోసం ఎవరైనా స్పెషల్ చట్టం తీసుకువస్తారా అని అంటారు ఎవరైనా. కానీ జపాన్ లో మాత్రం ఇలాంటి వింత చట్టం తీసుకొచ్చారు. నార్త్ జపాన్లోని యమగట అడ్మినిస్ట్రేషన్ లో ఇక ఈ ఉత్తర్వులు ఇచ్చింది. నవ్వితే గుండెపోటు ముప్పు తగ్గుతుందని పరిశోధనలో తేలడంతో ఈ రూల్ పాస్ చేసింది. ఇక నెలలో 8వ రోజున నవ్వు దినంగా జరుపనుంది. పని ప్రదేశంలో ఈ రూల్ తప్పక పాటించాలి అంటూ తెలిపింది. కాగా నవ్వాల వద్ద అన్న విషయం అనేది వ్యక్తిగతం అంటూ తెలిపింది.