షాకింగ్ : ప్రియుడి ఆత్మతో.. పెళ్లికి సిద్ధమైన యువతి?
అయితే ఇద్దరు యువతీ యువకుల మధ్య పుట్టిన ప్రేమ తప్పకుండా సక్సెస్ అవుతుంది అని మాత్రం చెప్పలేం. కొంతమంది పెద్దల కోసం ప్రేమను వదిలేసుకొని ఎవరి దారి వారు చూసుకుంటారు. ఇంకొంత మంది ఏకంగా ప్రేమను గెలిపించుకుని పెళ్లి చేసుకుంటూ ఉంటారు మరి కొంత మంది ప్రేమించిన వారు ప్రమాదవశాత్తు దూరమైతే ఇక వారిని తలచుకుంటూ బాధపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక యువతకి ఇలాంటి బాధ మిగిలింది. ఎంతో ప్రాణం గా ప్రేమించిన ప్రియుడు దురదృష్టవశాత్తు చనిపోయాడు. దీంతో ఆ యువతి సంచలన నిర్ణయం తీసుకుంది.
ఏకంగా ప్రియుడి ఆత్మను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ విచిత్రకరమైన ఘటన తైవాన్ లో వెలుగులోకి వచ్చింది. కారు ప్రమాదంలో చనిపోయిన తన ప్రియుడి ఆత్మను పెళ్లి చేసుకునేందుకు యు అనే యువతి సిద్ధమైంది. ఈనెల 15వ తేదీన జరిగిన కారు ప్రమాదంలో యు ముగ్గురిని కాపాడగా.. ప్రియుడిని రక్షించలేకపోయింది. దీంతో అతనిపై ఉన్న ప్రేమ, అతని తల్లి ఒంటరి అయిపోతుందని భావనతో చివరికి సాంప్రదాయంగా అతని ఆత్మను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇక ఈ వివాహంలో మరణించిన వ్యక్తి ఫోటోలు బట్టలు ఉపయోగించి పెళ్లి తంతును పూర్తి చేసారు.