యూఎస్ ప్రభుత్వానికి ఏలియన్ల బాడీలు దొరికాయా.. పెంటగాన్ మాజీ ఉద్యోగి షాకింగ్ కామెంట్స్..?

frame యూఎస్ ప్రభుత్వానికి ఏలియన్ల బాడీలు దొరికాయా.. పెంటగాన్ మాజీ ఉద్యోగి షాకింగ్ కామెంట్స్..?

praveen

 ఏలియన్స్ ఉన్నాయా లేవా అనేది ఎన్నో రోజులుగా ఒక ఆసక్తికర ప్రశ్నగా అందరి మెదడులను తొలిచేస్తుంది. వీటిపై పనిచేసే శాస్త్రవేత్తలకు ఈ విషయం తెలిసే ఉంటుందని కొంతమంది అనుకుంటారు. కొందరి అధికారులు అయితే ఏలియన్స్ గురించి తరచుగా షాకింగ్ కామెంట్లు చేస్తూ వైరల్ అవుతుంటారు. తాజాగా యూఎస్ రక్షణ శాఖ పెంటగాన్‌లో ఒకప్పుడు గూఢచారిగా పనిచేసిన వ్యక్తి, భూమిపై గ్రహాంతర జీవులు ఎప్పుడో ల్యాండ్ అయ్యాయని షాకింగ్ కామెంట్లు చేశారు. అమెరికా ప్రభుత్వానికి ఈ గ్రహాంతర వాసుల గురించి చాలా కాలంగా తెలుసు అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
అతని ప్రకారం, ప్రభుత్వం దగ్గర ఆరిజిన్‌ తెలియని కొన్ని వాహనాలు ఉన్నాయి. డైలీ మెయిల్ ఇంటర్వ్యూలో, యూఎఫ్‌ఓలను అధ్యయనం చేసే లూయిస్ ఎలిజాండో అనే వ్యక్తి 1947లో రోస్‌వెల్‌ అనే ప్రదేశంలో కూలిపోయిన వస్తువులోని భాగాలను ప్రభుత్వం తీసుకుందని, అది మనకు తెలియని వాహనమని చెప్పారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది చూసి, లైక్‌ చేశారు.
"ఈ విశ్వంలో మనమే అత్యంత తెలివైన జీవులమని అనుకోవడం చాలా అహంకారంగా ఉంది. వేరే గ్రహాల జీవులు మనకంటే తెలివైనవి అని అనుకోవడంలో ఆశ్చర్యం ఏముంది? అని నెటిజన్లు కొందరు కామెంట్లు చేశారు. "నేను ఇలాంటి విషయాలను నమ్మను కానీ, రోజూ చాలామంది ఎందుకు కనిపించకుండా పోతున్నారు? దీని వెనుక మరో కథ ఉందేమో" అని ఒక యూజర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన నిజమైన ఆధారాలు ఏమీ లేవు అని ఇంకొకరు పేరు.
ఎలిజాండో గతంలో ప్రభుత్వ రహస్యాలను కాపాడే ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా పనిచేశారు. 2017లో, న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా సైన్యం, గూఢచార సంస్థలు యూఎఫ్‌ఓల గురించి ఎందుకు రహస్యంగా ఉంచుతున్నాయో సంచలనంగా మారారు. దీని వల్ల చాలా మందికి అతను ఎవరో తెలిసింది. ఆ తర్వాత, హిస్టరీ ఛానెల్‌లో ప్రసారమైన ఒక డాక్యుమెంటరీ సిరీస్‌లో కనిపించడం వల్ల అతను మరింత పాపులర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: