ప్రపంచంలోనే భయంకరమైన బాడీ బిల్డర్.. చివరికి ఎలా చనిపోయాడో తెలుసా?

praveen
ఈ మధ్యకాలంలో మనిషి ప్రాణం ఎప్పుడూ ఎలా పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు వ్యాయామం చేస్తే పౌష్టికాహారాన్ని తీసుకుంటే ఎక్కువ రోజులు బతకచ్చు అని మొన్నటి వరకు వైద్యులు చెప్పేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఇలా వైద్యులు  చెప్పినవన్నీ పాటిస్తున్న కొంతమంది మాత్రం సడన్ హార్ట్ ఎటాక్లకు బలవుతున్నారు అన్న విషయం తెలిసిందే. అప్పటి వరకు సంతోషంగా గడిపిన వారు రెప్పపాటు కాలంలో చివరికి ప్రాణాలను కోల్పోతున్న తీరు అందరిని భయాందోళనకు గురిచేస్తుంది.

 ప్రతిక్షణం కూడా భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. ఏకంగా ప్రపంచంలోనే భయంకరమైన బాడీ బిల్డర్ గా పేరు సంపాదించుకున్న ఇలియా గోలెం అనే ముప్పై ఆరేళ్ల వ్యక్తి హార్ట్ ఎటాక్ తో కన్నుమూశాడు. ఈనెల ఆరవ తేదీన గుండెపోటుకు గురైన ఆయన చికిత్స పొందుతూ.. ఇక 11వ తేదీన ప్రాణాలు కోల్పోయాడు. బెలారస్కు చెందిన ఈ బాడీ బిల్డర్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అతడిని ది మ్యూటంట్ అనే నిక్ నేమ్ తో పిలుచుకుంటూ ఉంటారు ఇంటర్నెట్ జనాలు. 154 కిలోల బరువు ఉన్న ఈ బాడీ బిల్డర్ 6.1 అంగుళాల ఎత్తు ఉంటాడు.

 చూడ్డానికి భయంకరమైన రూపంతో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్నాడు ఇతగాడు. ప్రతిరోజుకి 16,500 కేలరీల ఆహారాన్ని తీసుకుంటాడు. ఇందులో ఏకంగా 2.5 కిలోల మాంసం ఉంటుందని గతంలో చెప్పుకొచ్చాడు. రోజుకు 7 సార్లు తింటాడట. సెప్టెంబర్ ఆరవ తేదీన ఇంట్లో ఉన్న సమయంలోనే గుండెపోటు వచ్చిందట. కుటుంబ సభ్యులు వెంటనే అతనికి సిపిఆర్ చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇక విమానంలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతనికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక కోమాలోకి వెళ్ళిన అతడు ఇటీవలే తుది శ్వాస విడిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: