వామ్మో.. కిలో బియ్యం రూ.15 వేలా?

frame వామ్మో.. కిలో బియ్యం రూ.15 వేలా?

praveen
సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇలా వెలుగులోకి వచ్చే వాటిలో కొన్ని ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక అలాంటివి అసలు నమ్మడానికి కూడా నమ్మశక్యం కాని విధంగానే ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే సాధారణంగా కిలో బియ్యం ఎంత ఉంటాయి అంటే ఎవరైనా ఏం చెబుతారు.. 50 రూపాయలు నుంచి 60 రూపాయల వరకు ఉంటాయి. మహా అయితే ₹100 ఉంటటాయ్. ఒకవేళ అవి బాస్మతి రైస్ అయితే ఇక 100 నుంచి 200 వరకు కిలో ఉంటుంది అని చెబుతారు ఎవరైనా.

 నేటి రోజుల్లో పేద మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే సన్నబియ్యం అయితే క్వింటాల్ కి ఐదు నుంచి 6000 రూపాయలు మార్కెట్లో పలుకుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాము. కానీ బియ్యం కేవలం కిలోనే 15వేల రూపాయలు ఉండడం ఎప్పుడైనా వినడం గాని చూడటం గాని చేశారా.. కిలో పదిహేను వేల రూపాయలా.. అలాంటి బియ్యం ఉన్నాయి అన్న విషయం కూడా మాకు ఇప్పటి వరకు తెలియదు అని సమాధానం చెబుతారు ఎవరైనా. అయితే ఇంకొంతమంది ఇది అబద్ధం అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పొరపాటు పడినట్టే. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది కాస్లీ రైస్ గురించి.

 అత్యంత ఖరీదైన బియ్యాన్ని జపనీయులు పండిస్తున్నారు అన్న విషయం చాలామందికి తెలియదు. అయితే జపనీస్ కిన్మేమై రైస్ కిలో ఏకంగా 15000 రూపాయలు. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ ముమ్మాటికి నిజమే  పేటెంట్ పొందిన కిన్మే మై ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించి దీనిని పండిస్తూ ఉంటారట. అయితే ఈ బియ్యంలో ఉన్నతమైన రుచి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయట. కాగా జపనీలు ఇక ఈ బియ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా అటు కిలో పదిహేను వేల రూపాయలు అంటే నిజంగా అవాక్కయ్యే విషయమే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: