అధికారం వచ్చిందో లేదో.. ఇండియాకు ట్రంప్ భారీ షాక్?

praveen
ప్రపంచ దేశాలకు పెద్దన్నగా పిలుచుకునే అమెరికాలో ఇటీవలే అధ్యక్ష ఎన్నికలు ఎంత ఉత్కంఠ భరితంగా సాగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే అటు అమెరికా ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో ఆసక్తిగా చూసాయి. ఇక నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా సాగిన ఫలితాలలో డోనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అన్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారో లేదో ఇక భారత్ తో సత్సంబంధాలు మెరుగుపడతాయని అందరూ భావించారు. ఎందుకంటే భారత ప్రధాని మోడీకి ట్రంప్ కి మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే.

 దీంతో ఈ స్నేహబంధం నేపథ్యంలో అమెరికాకు వలస వెళ్లిన భారతీయుల విషయంలో అంత కఠినమైన ఆంక్షలు ఉండే అవకాశం లేదు అని అందరూ అంచనా వేశారు. కానీ ట్రంప్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇక ట్రంప్ తీసుకోబోయే నిర్ణయంపై ఇక ఇప్పుడు ఇండియాలో అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ట్రంప్ అధికారం చేపట్టిన తొలి రోజే భారతీయులను తీవ్రంగా దెబ్బతీస్తే ఉత్తర్వులపై సంతకం చేసే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ట్రంప్ మొదటి సంతకం ప్రభావం ఏకంగా అమెరికాలోని 10 లక్షల మందిపై ఉంటుందని పేర్కొంది.

 ప్రస్తుతం అమెరికాలో ఉన్న నిబంధనల ప్రకారం గ్రీన్ కార్డ్  ఉన్నవారికి పిల్లలకు ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అమెరికాలో ఉంటున్న భారత సంతతి వారికి అమెరికాలో ఉన్నప్పుడు పుట్టపిల్లలందరికీ అమెరికా పౌరసత్వం వస్తుంది. అయితే తల్లిదండ్రులు అమెరికా పౌరులు కానిపక్షంలో వారి పిల్లలకు ఆటోమేటిక్గా పౌరసత్వం ఇచ్చే నిబంధనలను మార్చుతూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఇక పాత పద్ధతికి స్వస్తి పలుకుతారని చర్చ జరుగుతుంది. అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారి పిల్లలకు మాత్రం అమెరికా పౌరసత్వం రాదని ఇన్నాళ్లు భారతీయులు భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పటికే తయారైన నమూనా నిబంధనలను చూస్తూ ఉంటే తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు అమెరికాకు చెందినవారు అమెరికా పౌరునిగా తప్పనిసరిగా ఉండాలి అనే నిబంధన తీసుకురాబోతున్నారట ట్రంప్. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఏకంగా 10 లక్షల భారతీయులపై ప్రభావం పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: