ట్రంప్ గెలుపు.. పురుషులతో ఆ పనికి నో చెబుతున్న మహిళలు?
ఇప్పుడు సౌత్ అమెరికన్ లేడీస్ ఇదే ఉద్యమాన్ని భుజాలు ఎత్తుకోవడం అక్కడే పురుషులకు షాకిస్తోంది. పురుషులతో సంబంధాలకు దూరంగా ఉన్న స్త్రీల వీడియోలు, సోషల్ మీడియా పోస్ట్‌లు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్‌లో వైరల్ గా మారాయి. ఈ వీడియోలలో మహిళలలు తమ నిర్ణయం మహిళల పునరుత్పత్తి హక్కుల గురించి, ముఖ్యంగా అబార్షన్ పొందే హక్కు గురించిన భయాలతో ముడిపడి ఉందని వివరించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ఆందోళనలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ట్రంప్ అబార్షన్ చేసుకునే వీల్లేదని అన్నారు.
ఒక వైరల్ వీడియోలో, "రాబోయే నాలుగు సంవత్సరాలు, నేను పురుషులతో సెక్స్‌కు దూరంగా ఉంటాను" అని ఒక మహిళ ప్రకటించింది. ట్రంప్ ఉన్నంత కాలం శారీరక సంబంధాలను నివారించడం ద్వారా నిరసన తెలుపుతామని మరొకరు అన్నారు. రిపబ్లికన్ పార్టీకి మద్దతిచ్చే యువ ఓటర్ల సంఖ్య పెరుగుతుండడం పట్ల మరో మహిళ తన నిస్పృహను వ్యక్తం చేసింది. అబార్షన్ హక్కులపై తన ఆందోళన వ్యక్తం చేసింది. “ఈ పురుషులందరూ మా హక్కులను తీసివేయడానికి ఓటు వేస్తే, రాబోయే నాలుగేళ్లపాటు స్త్రీని తాకడానికి వారు అర్హులు కారు." అని ఒక మహిళ ఎండి పడింది
ఒక టిక్‌టాక్ యూజర్ మాట్లాడుతూ "ఒక మహిళగా, నా శారీరక హక్కులు నా సొంతం నాకు ముఖ్యమైనవి, దానిపై సార్వభౌమాధికారాన్ని అమలు చేయడానికి ఇది నా మార్గం" అని అన్నారు. మహిళలు డేటింగ్ యాప్‌లను తొలగించి, స్ఫూర్తి కోసం 4B ఉద్యమాన్ని చూడాలని మరో వీడియో సూచించింది, "అమెరికన్ మహిళలు సొంత 4B ఉద్యమంలో పాల్గొనడానికి ఇది సమయం అని నేను భావిస్తున్నాను." అని ఇంకొందరు అన్నారు.