వెయ్యి రోజులు దాటిన ఉక్రెయిన్ vs రష్యా యుద్ధం.. ఎంత వినాశనం జరిగిందంటే?

praveen
మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతుందో అని ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి అంతటికీ కారణం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఎన్నో సంచలన పరిణామాలే. ఎన్నో దేశాల మధ్యయుద్ధ వాతావరణం నెలకొంటూ ఉంది అని చెప్పాలి. మొన్నటి వరకు చైనా భారత్ మధ్య సరిహద్దులో ఎంత వివాదం నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఏకంగా మిస్సైల్స్ దాడులలతో తీవ్ర స్థాయి యుద్ధము జరుగుతుంది. ఇంకోవైపు రష్యా ఉక్రెయిన్ దాదాపు మూడేళ్ల క్రితం మొదలైన యుద్ధం ఇంకా ఆగనేలేదు.

 మరోవైపు రష్యా ఉత్తర కొరియా లాంటి దేశాల మధ్య జరుగుతున్న ఒప్పందాలు మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలుగా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవలే రష్యా ఉక్రెయిన్ మధ్య మొదలైన వివాదం నేటికీ ఏకంగా 1000 రోజులను పూర్తి చేసుకుంది. అంటే మూడు సంవత్సరాలకు పైమాటే. దీంతో ఇక ఈ యుద్ధంలో ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత వినాశకరయుద్ధం ఇదే అంటూ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

 రెండు వైపులా 10 లక్షలు పైగా మరణించారని సమాచారం. ఉక్రెయిన్ లో ఐదో వంతు అంటే గ్రీస్ తో పోల్చి చూస్తే సమానమైన భూభాగాన్ని రష్యా ఆధీనంలోకి తీసుకుంది అన్న విషయం తెలుస్తోంది. ఇక 2022 తో పోల్చి చూస్తే ఆ దేశ ఎకానమీ కూడా 33 శాతం పడిపోయింది. మొత్తంగా 152 బిలియన్ల డాలర్లు నష్టపోయింది. ఒకప్పటిలా మౌలిక సదుపాయాలు మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే  ఉక్రెయిన్ కి 485 బిలియన్ డాలర్లు అవసరం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. దీనికి తోడు ఇజ్రాయిల్ కు  ఇస్తున్న లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ని అటు రష్యాపై వాడేందుకు అమెరికా అనుమతి ఇచ్చింది. ఇక ఈ సంచలన ప్రకటనతో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనే విషయంపై ఉత్కంఠ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: