చైనాలో అద్భుతం.. నిమిషంలో విమానంలా మారిన కార్.. ఈ వీడియో చూడాల్సిందే?

praveen
నేటి రోజుల్లో టెక్నాలజీ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. ఒకప్పుడు సైకిల్ తయారు చేసి ప్రయాణ భారాన్ని తగ్గించారు. ఇక ఆ తర్వాత కాలంలో బైక్  ను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రయాణం మరింత వేగంగా జరిగే విధంగా సరికొత్త ఆవిష్కరణను తీసుకువచ్చారు. ఇక ఎంతో విలాసవంతమైన ప్రయాణం కోసం కార్లను కూడా మార్కెట్లోకి తీసుకోవచ్చారు. ఇక ఇప్పుడు ఫ్లయింగ్ కార్ల వంతు వచ్చింది. భవిష్యత్తులో ఫ్లయింగ్ కార్లదే హవా నడవబోతుంది అని ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే ఎన్నో దేశాలు ఫ్లయింగ్ కార్లు తయారు చేయడం పై దృష్టి కూడా పెట్టాయి అన్న విషయం తెలిసిందే.

 ఇటీవల కాలంలో వాహనాల సంఖ్య పెరిగిపోయిన నేపద్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాములు జరుగుతూ ఎంతో సమయం వృధా అవుతుంది. ఈ క్రమంలోనే ఫ్లయింగ్ కారును అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇలా ట్రాఫిక్ సమస్యలను తప్పించాలనే ఉద్దేశంతో ఎన్నో కంపెనీలు కొత్త ఆవిష్కరణ వైపు అడుగులు వేస్తున్నాయి. అయితే ఇలా ఎప్పుడూ టెక్నాలజీ సాయంతో అద్భుతాలు చేయడంలో ముందుండే చైనా.. ఇక ఇప్పుడు మరో అద్భుతాన్ని చేసి చూపించింది. ఏకంగా ఫ్లయింగ్ కారును కనుక్కుంది. భూమ్మీద అధికారుల లాగానే దూసుకుపోయే కారు నిమిషాల్లోనే ఏకంగా హెలికాప్టర్ గా మారిపోతుంది.

 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. చైనీస్ బ్రాండ్ x peng మాడ్యులర్ ఫ్లయింగ్ కారును ఆవిష్కరించి అద్భుతాన్ని సృష్టించింది. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ కారును ల్యాండ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గా పిలుస్తున్నారు. ఇటీవల జరిగిన చైనా ఇంటర్నేషనల్ ఏవియేషన్ అండ్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్లో దీనిని ప్రదర్శించారు. ముడుచుకుపోయే విధంగా ఉన్న హెలికాప్టర్ కారులో మిళితమై ఉంటుంది. అవసరమైనప్పుడు దానిని బయటకు తీసి ఉపయోగించుకోవచ్చు. కాగా దీని ధర 2.36 కోట్ల రూపాయలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.Your browser does not support HTML5 video.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: