"ప్రవాస భారతీయుడి".. ఔదార్యం..అమర జవాన్ల కోసం...

NCR

కొన్ని రోజుల క్రితం భారత్ లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల కోసం ఎంతో మంది భారతీయులు ప్రపంచ నలుమూలల నుంచీ స్పందిస్తున్నారు. జవాన్ల కుటుంభాలకి సాయం అందించాలని కోరుకుంటూనే వారికోసం భారీ మొత్తంలో నిధులు సేకరించి సీఆర్‌పీఎఫ్‌ సహాయ నిధికి పంపుతున్నారు.

 

అయితే ఈ క్రమంలోనే అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు వివేక్ పటేల్ గుజరాత్ లోని వడోదోర వ్యస్తవ్యుడు అయిన ఆయన ప్రస్తుతం అమెరికాలోని వర్జీనియాలో ఉంటున్నారు. ఆర్మీ జవాన్ల దాడి ఘటన జరిగిన నాటినుంచీ  జవాన్ల కుటుంబాల సహాయార్థం విరాళల సేకరణ మొదలుపెట్టారు.

 

అందుకోసం ఫేస్బుక్ లో ఫండ్‌ రైజర్‌ ఫీచర్‌ను వేదికగా చేసుకున్న ఆయన ఆక్షణం మొదలు జవాన్ల కోసం పాతుపడుతూనే ఉన్నారు..కేవలం గడిచిన ఆరురోజుల కాలంలోనే ఆయన సుమారు రూ.5.60 కోట్ల విరాళాలు కూడగట్టారు.. ఆ మొత్తాన్ని సీఆర్‌పీఎఫ్‌ సహాయ నిధికి పంపుతున్నట్లుగా ఆయన తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: