అమెరికాలో భారతీయుడి "భూరి విరాళం"..ఎందుకంటే..???

NCR

అమెరికాలో వివిధ రంగాలలో స్థిరపడిన భారతీయులు ఆర్ధికంగా ఎంతో నిలదొక్కుకున్నారు. వారిలో చాలామంది సేవా కార్యకమాలు, పలు రకాల సమాజ సేయస్సు కోసం కొంత సొమ్ముని ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ కోణంలోనే ఓ భారత సంతతి దంపతులు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కి భారీ విరాళాన్ని ప్రకటించారు.

 

గణిత శాస్త్ర భారతీయ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన శ్రీనివాస రామానుజన్ పేరిట యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా గణిత విభాగంలో ప్రొఫెసర్‌షిప్‌ను ప్రారంభించడం కోసం భారత సంతతి దంపతులు దాదాపు రూ.7 కోట్లు విరాళంగా ఇచ్చారు. గణిత శాస్త్రానికి ఎనలేని సేవలు చేసిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్‌పై గౌరవంతో తాను పనిచేస్తున్న చేస్తున్నట్లుగా ప్రొఫెసర్ వరదరాజన్, ఆయన భార్య వేద తెలిపారు.

 

ఈ కార్యక్రమం జరపడానికి యూనివర్సిటీ కూడా సమ్మతించిందని వారు తెలిపారు. ఈ ఏడాది డిసెంబరులో జరగనున్న వర్సిటీ శత వార్షికోత్సవాల్లో భాగంగా దీనిని ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. వరదరాజన్ బెంగుళూరు లో జన్మించారు. మద్రాసులో ఎమ్మెల్సీ చేసి, కలకత్తా లో పీహెచ్‌డీ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: