వారికి "పౌరసత్వ హక్కు రద్దు"..ట్రంప్ కీలక ప్రకటన..!!!!

NCR

అగ్రరాజ్యం అమెరికాలో అక్రమ వలసలు నిరోధానికి అధ్యక్షుడు ట్రంప్ కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా అమెరికాలో పుట్టిన వారికి జన్మ హక్కుగా వచ్చే పౌరసత్వ విధానంపై ఓ నిర్ణయానికి వస్తున్నట్లుగా ప్రకటించారు. అమెరికాలో పుట్టిన వారికి పౌరసత్వాన్ని కల్పించే విధానం ఒక హాస్యాస్పదమని, ఇందుకు తాము వ్యతిరేకంగా ఉన్నామని ఆ విధానాన్ని త్వరలోనే రద్దు చేస్తామని ప్రకటించారు.

 

అమెరికాలో జన్మించిన వారికి సంక్రమించే పౌరసత్వ హక్కు గురించి బుధవారం శ్వేత సౌధంలో విలేఖరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ. జన్మతః వచ్చే పౌరసత్వ విధానం గురించి మేము తీవ్రంగా ఆలోచన చేస్తున్నామని, అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు  అమెరికా పౌరులు గా మారే బర్త్ రైట్ సిటిజన్షిప్ విధానాన్ని రద్దు చేస్తామని అందుకు తగ్గట్టుగా ఆదేశాలను త్వరలోనే అధికారులకి అందజేస్తామని ప్రకటించారు.

 

ఇదిలా ఉంటే గత అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ ఈ విధంపై తాను పూర్తి వ్యతిరేకమని, ఈ విధానం రద్దు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు. అయితే వారసత్వ హక్కు ని అమెరికా రాజ్యాంగ 14 వ సవరణ స్పష్టం చేస్తోంది. కానీ ట్రంప్ రాజ్యంగా విధానాలని పూర్తిగా చదవకుండా వ్యాఖలు చేయడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని అంటూ చురకలు అంటించారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: