అమెరికాలో పోటాపోటీగా కోఆర్డినేటర్ల నియామకం...!!

Shyam Rao
రాష్ట్ర ప్రభుత్వం అమెరికాకు చెందిన ఇరువురు ప్రవాస తెలుగు ప్రముఖులకు కీలక పదవులను సృష్టించి మరీ కట్టబెట్టింది. సిలికాన్ వ్యాలికి చెందిన కోమటి జయరాంను అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. జన్మభూమి కార్యక్రమాలను సమన్వయ పరిచే బాధ్యతలను జయరాంకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. టెక్సాస్ ప్రాంతానికి చెందిన మరొక ప్రవాసాంధ్ర ప్రముఖుడు డా. వేమూరి రవికి ఏపీఎన్ఆర్టీ సంస్థ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించింది. వీరిరువురు ప్రస్తుతం తమకు అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేకూర్చడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. 



అమెరికా నలుమూలల వివిధ నగరాల్లో తమ పనులను చక్కపెట్టడానికి తమ తరపున నిధులు సేకరించడానికి ప్రత్యేక కోఆర్డినేటర్ లను ఎవరికివారే విడివిడిగా పోటాపోటీగా నియమించుకుంటున్నారు. ఇప్పటివరకు ఒక్కొక్కరు ఇరవై మందికి చొప్పున నలభై మంది కోఆర్డినేటర్లు రెండు సంస్థల తరపున నియమించారు. కోమటి జయరాం జన్మభూమి పథకం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతుల నిర్మాణానికి అమెరికాలో నిధులు సేకరిస్తున్నారు. 



ఒక్కొక్క పాఠశాలకు ఒక్కొక్క ప్రవాసాంధ్రుడు నుండి 750 డాలర్లు విరాళంగా సేకరిస్తున్నారు. అక్టోబర్ రెండో తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించాలనే లక్ష్యంతో 7.50 లక్షల డాలర్లను సేకరించే పనిలో జయరాం నిమగ్నమయ్యారు. దీనితోపాటు అంగన్వాడి భవనాల నిర్మాణానికి, గ్రామాలలో శ్మశాన వాటికల అభివృద్ధికి జయరాం ప్రవాసాంధ్రులు నుండి నిధులను సేకరిస్తున్నారు.



ఏపీఎన్ఆర్టీ చైర్మన్ గా నియమితులైన డా. వేమూరి రవి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ గ్రామాల రూపకల్పన పథకం కింద నిధులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కోమటి జయరాం, వేమూరి రవి తమ తరపున నిధఉలు సేకరించడానికి కోఆర్డినేటర్లు అమెరికా అంతటా పోటాపోటీగా నియమించుకోవడం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది వీరిరువురు అమెరికాలోని ప్రధఆన నగరాల్లో ఇప్పటికే విడివిడిగా సమావేశాలు నిర్వహించి నిధులు సమికరణను ప్రారంభించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: