"హెచ్‌1బీ" వీసాదారులకి "గుడ్ న్యూస్"

Bhavannarayana Nch

అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం హెచ్‌1బీ వర్క్ వీసాదారులకు సుభవార్త తెలిపింది..ఈ వీసాని కలిగిఉన్న వారు ఎవరైనా సరే ఎన్ని ఉద్యోగాలు అయినా సరే చేసుకోవచ్చు అంటూ ప్రకటన్ చేసింది. ఇండియాకి చెందిన ఐటీ రంగ నిపుణులు మరియు అనేకమంది హెచ్‌1 బీ వీసా కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సాంకేతికపరంగానో  లేదా సైద్ధాంతికంగా నిపుణులైన విదేశీయులు ఈ వీసా కలిగిఉన్నట్టయితే అమెరికా కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి.

 

అయితే వారు చేసే ప్రతీ ఉద్యోగానికి తప్పనిసరిగా అనుమతి పొంది ఉండాలి..అని అమెరికా సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) స్పష్టం చేసింది. అయితే ఉద్యోగి విధుల్లో చేరేముందు ఇందుకు సంబంధించి సంబంధిత సంస్థ యజమాని....యూఎస్‌సీఐఎస్‌కి 1–129 ఫారమ్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అందులో ఉద్యోగి వివరాలను తెలియచేయాలి. ఇది కొత్త నిబంధన కాకపోయినప్పటికీ అతికొద్దిమందికి మాత్రమే తెలుసు. విదేశాలనుంచి ఇక్కడికి రాదలుచుకున్నవారికి ఈ సంస్థ హెచ్‌1బీ వీసా దరఖాస్తులను పరిశీలించి ఆ తరువాత ఖరారు చేస్తుంది.  

 

అయితే ఈ విసాలని ప్రతీ సంవత్సరం సుమారు 65 వేలమందికి మాత్రమే ఈ వీసాలను మంజూరు చేస్తుంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసినవారు ఇందుకు అర్హులు. ఇక గ్రీన్‌కార్డులు కలిగిఉన్నవారిలో 85 శాతం మంది ఇప్పటికే ఇక్కడ స్థిరపడిపోయారు.ఈ మధ్య అమెరికా వీసా నిభందలనలో మార్పులు చేస్తూ సులభతరం చేయడంతో ఎంతో మంది విదేశీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: