ప్రవాసుల్లో “భారతీయులే టాప్”..లిస్టు చుస్తే షాక్ అవుతారు

Bhavannarayana Nch

దేశ విదేశాల్లో ఉంటున్న మన భారతీయులే ప్రవాసం వచ్చిన వారిలో టాప్ లిస్టు లో ఉన్నారని సుమారు..భారత్‌కు చెందిన సుమారు 16 మిలియన్ల మంది వివిధ దేశాల్లో జీవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది..ప్రపంచంలో ఎక్కడైనా సరే భారతీయుల హవా ఉంటుంది..అక్కడ ఉద్యోగాలలో..వ్యాపారాలలో మాత్రమే కాదు..అక్కడ ఉండే ప్రభుత్వాలలో భారతీయులు వారి సత్తా చాటుతున్నారు..సుమారు 2015 నాటికి మొత్తం 243 మిలియన్ల అంతర్జాతీయ ప్రవాసీల్లో....భారతీయలే 6 శాతంగా ఉన్నారు.. 2010లో వీరి సంఖ్య 10 శాతం పెరిగినట్లుగా..ఐరాస నివేదిక తెలియజేసింది.

 

2015 నాటికి 7.3 బిలియన్ల ప్రపంచ జనాభాలోని ప్రతి 30 మందిలో ఒకరు విదేశాలకు వలసపోతున్నారని...2010తో పోల్చితే ఇది 0.1 శాతం పెరిగిందని పేర్కొంది. ఐరాసకు చెందిన అంతర్జాతీయ వలవాదుల సంస్థ ‘వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2018’ పేరుతో ఈ నివేదికను ప్రకటించింది...భారత్ తర్వాతి స్థానంలో మెక్సికో.. రష్యా..చైనా.. బంగ్లాదేశ్.. పాకిస్థాన్ వాసులు ఉన్నారు...అంతర్జాతీయ వలసవాదులకు అమెరికా గమ్యస్థానంగా మారిందని..1970లో  12 మిలియన్లుగా ఉన్న వీరి శాతం..2015 నాటికి 46.6 మిలియన్లకు చేరింది. వీరిలో 2 మిలియన్లు మంది భారతీయులే ఉన్నారు. భరత్ నుంచీ ఎక్కువ శాతం గల్ఫ్ దేశాలకు వలసపోతుండగా..ఆ తర్వాత అమెరికాకు వెళ్తున్నట్టుగా ఈ నివేదిక తెలిపింది.


యూఏఈలో-3.5 మిలియన్లు.. అమెరికాలో- 2 మిలియన్లు..సౌదీ అరేబియాలో-1.9 మిలియన్లు ప్రవాసీ భారతీయులు ఉన్నారు. ఈ దేశాల్లో వలసవాదులకు రక్షణకు చర్యలు మరింత పటిష్ఠం చేయడంతో అత్యధికంగా తరలిపోతున్నారని ఇమ్మిగ్రేషన్ నిపుణులు పేర్కొంటారు..అయితే ఇప్పుడు ఈ సంఖ్య ఎక్కువగా అమెరికాకు రావచ్చు అని తెలుస్తోంది..ఎందుకంటే..ప్రస్తుతం అమెరికా హెచ్-1బి వీసా నిబంధనలు సంక్లిష్టం చేయడంతో భారతీయులు తీవ్రంగా ప్రయత్నించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: