"కరీంనగర్" వాసి అమెరికాలో దుర్మరణం..

Bhavannarayana Nch

అమెరికాలో మొన్నటి వరకూ జాత్యహంకార హత్యలు జరుగుతూ భారతీయులు ప్రాణాలు కోల్పోతూ ఉంటే..ఇటీవల కాలలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు వలన అనేకమంది ఎపీకి సంభందించిన తెలుగువారు ప్రాణాలు కోల్పోతున్నారు..సరిగ్గా కొన్ని రోజుల క్రితం భువనగిరికి చెందినా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలని కోల్పోయాడు..అయితే ఇప్పుడు తాజాగా మరొక తెలుగు వ్యక్తి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు..వివరాలోకి వెళ్తే...

 

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భరత్ రెడ్డి దుర్మరణం చెందాడు..అమెరికాలోని సౌత్‌ఫ్లోరిడాలో ఈ దుర్ఘటన జరిగిందని తెలుస్తోంది..మృతుడు పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడిగా తెలుస్తోంది..ఈ నెల 13న స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేస్తున్న భరత్ రెడ్డి అదుపుతప్పి కింద పడిపోయాడు.ఆ సమయంలో వెనుకగా వస్తున్న ట్రక్ అతని పైనుంచి వెళ్లింది. భరత్ రెడ్డిని వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళినా సరే ప్రాణాలు దక్కలేదు.


అయితే భరత్ రెడ్డి చనిపోయిన విషయం వారి కుటుంబ సభ్యులకు..అతడి మరణవార్తను చెప్పేందుకు స్నేహితులు చెప్పలేక సతమతమయ్యారు. ఈ సమాచారం తెలియగానే ఆస్ట్రేలియాలో ఉంటున్న భరత్ రెడ్డి సోదరుడు అమెరికా బయల్దేరాడు...అమెరికాలో ఫిబ్రవరిలో జరగనున్న డాల్ఫీన్స్ క్యాన్సర్ ఛాలెంజ్‌ పోటీల్లో పాల్గొనేందుకు భరత్ రెడ్డి సైక్లింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సౌత్ ఫ్లోరిడాలోని బాపిస్ట్ హెల్త్‌లో ఐటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న భరత్ రెడ్డి మంచి అథ్లెట్ అని తెలిసింది. అమెరికాలోని ట్రియాథ్లాన్ క్లబ్, గో రన్ రన్నింగ్ క్లబ్‌లో అతనికి సభ్యత్వం కూడా ఉంది.ఎన్నో సేవా కార్యక్రమాలో భరత్ రెడ్డి ముందు ఉండేవాడని..ఎవరికైనా ఏదైనా సాయం అంటే ముందు ఉంది చేసేవాడని భరత్ రెడ్డి స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: