“డ్రీమర్ల బిల్లు కి బ్రేక్”...“ఎన్నారై” లకి “షాక్”

Bhavannarayana Nch

ఎంతో ఆశగా ఎదురుచూసిన డ్రీమర్ల కలలు చెదిరినట్టేనా..డ్రీమర్లు ఆశలు అది ఆశలు అయ్యినట్టేనా అంటే అవుననే అనాలి...ట్రంప్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన డ్రీమర్ల ఇమ్మిగ్రేషన్ బిల్లుకి సెనేట్ ఆమోద ముద్ర వేయలేదు..అసలు వివరాలలోకి వెళ్తే..


బాల్యంలోనే తల్లిదండ్రులతో అమెరికాకు అక్రమంగా వలసవచ్చిన 18 లక్షల మంది(డ్రీమర్ల)కు అమెరికా ఎగువసభ సెనేట్ షాకిచ్చింది...అలాంటి వారందరికీ అండగా ఉండేలా వారికి పౌరసత్వం కల్పించేందుకు అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన బిల్లును శుక్రవారం 60-39 ఓట్ల తేడాతో తిరస్కరించింది.

 

ఈ సంఘటనతో డ్రీమర్ల జీవితాలు ఎలానో అర్థం కాని పరిస్థితి నెలకొంది..ఈ నేపథ్యంలో డ్రీమర్ల భవితవ్యంపై అందోళన నెలకొంది...వాస్తవానికి ఈ బిల్లు గనుకా ఆమోదం పొందితే అటు డ్రీమర్లకు మేలు జరగడంతోపాటు ఇటు హెచ్1బీ వీసా కోసం ఎదురుచూస్తోన్న ఎంతోమంది భారతీయ ఎన్నారైలకి ఎంతో లబ్ధికలిగేది...అయితే ఇప్పుడు ట్రంప్ కి ఇది పెద్ద సవాలే ఎందుకంటే ఒబామా సమయంలో డ్రీమర్లకి దశలవారీగా పౌరసత్వం ఇచ్చేలా రూపకల్పన చేశాడు..ట్రంప్ గత నెలలో ఆ పధకాన్ని ఎత్తేసి మళ్ళీ చేతులు కాలాక ట్రంప్ బిల్లుని సెనేట్ ముందు ప్రవేశ పెట్టారు.

 

ఇదిలాఉంటే ఈ బిల్లు అమలు కాని నేపధ్యంలో మార్చి మార్చి 5వ తేదీ నుంచి డ్రీమర్స్ అందరూ దేశబహిష్కరణకు గురవుతారు...కానీ ఈ కీలక డ్రీమర్ల బిల్లుకి 60-39 ఓట్ల  మాత్రమే వచ్చాయి నిజానికి అమెరికా సెనెట్‌లో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే 60 ఓట్లు రావడం తప్పనిసరి..మరి సెనేట్ నిర్ణయంతో అత్యధిక ఎన్నారైలు ఉన్న భారతీయుల మీద ఈ బిల్లు ప్రభావం ఉండనుందని అంటున్నారు విశ్లేషకులు.


 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: