“ముగ్గురు భారతీయుల” కి దుబాయ్ కోర్టు “517 ఏళ్ల జైలుశిక్ష”

Bhavannarayana Nch

సంచలనం రేకెత్తిస్తున్న ఈ వార్త..ఇప్పుడు ప్రపంచం అంతా మారుమోగుతోంది...ఒక విదేశీ వ్యక్తులకి అన్నేళ్ల జైలు శిక్ష విధించడం దుబాయ్ చరిత్రలోనే ప్రప్రధమట..ముగ్గురు భారతీయ జంటలకి ఏకంగా 517 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ దుబాయ్‌ కోర్టు తీర్పు ఇవ్వడం పెను సంచలనం అయ్యింది..అయితే ఈ తీర్పు వెనుకాల అసలు విషయం తెలుస్తుకుంటే మాత్రం షాక్ అవ్వక మానరు..

 

గోవాకు చెందిన సిడ్నీ లెమోస్, అతడి భార్య వలనీ, రేయాన్ డీసౌజాలు, ఎసెన్షియల్ ఫారెక్స్‌ను నిర్వహించి సుమారు 200 మిలియన్ల డాలర్ల చీటింగ్ కి పాల్పడినట్టు దుబాయ్‌ న్యాయస్థానం నిర్ధారించింది...వీరు ఈ మోసానికి పాల్పడినందుకు గాను వారికి 517 ఏళ్ల జైలుశిక్ష విదిస్తునట్టుగా న్యాయమూర్తి డాక్టర్‌ మొహమ్మద్ హనాఫీ ఆదివారం తీర్పు వెల్లడించారు..

 

ఈ నిందితుల్లో ఒక్కొక్కరిపై 500పైగా కేసులు నమోదయ్యాయి వీటిలో నమొదయ్యాయి.. లక్షల డాలర్ల మోసాలకు పాల్పడ్డారని, అభియోగాలు అన్నీ రుజువయ్యాయని న్యాయమూర్తి తెలిపారు అయితే తీర్పుని వెల్లడించే సమయంలో దోషుల వల్ల నష్టపోయిన వారు ఎంతో మంది అక్కడే ఉన్నారు..ఈ కేసులో ట్విస్ట్ ఏమిటంటే న్యాయమూర్తి ఈ తీరుపుని వెల్లడించడానికి సిద్డం చేసిన ప్రతుల్ని చదవడానికి 15 నిమిషాల సమయం పట్టింది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: