అమెరికాలో “భారతీయుడి” రికార్డు “అదుర్స్”

Bhavannarayana Nch

ఏదేశమేగినా ఎందు కాలిడినా సరే భారతీయల సత్తా ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంటుంది..భారతీయులలో ఉన్న అపారమైన తెలివితేటలూ శక్తి సామర్ధ్యాలు ఆయా రంగాలలో నిరూపించబడుతూ ఉంటాయి..తాజాగా అమెరికాలో భారత సంతతి విద్యార్ధి ఎంతో ప్రతిష్టాత్మక జియోపార్డీ కాలేజ్‌ చాంపియన్‌షిప్ క్విజ్‌ పోటీలో విజేతగా నిలిచి, లక్ష డాలర్లు(66 లక్షల 21వేల రూపాయలు) గెలుచుకున్నాడు.

 

ఐవీ లీగ్‌ బ్రౌన్‌ విశ్వవిద్యాలయంలో పబ్లిక్‌ హెల్త్‌, ఎకనామిక్స్‌ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న ధ్రువ్‌ గౌర్‌... 14 మంది పోటీదారులను ఓడించి మరీ గ్రాండ్‌ ప్రైజ్‌ను సొంతం చేసుకున్నాడు. సెమీఫైనల్స్‌లో అతను మరో ఇండో-అమెరికన్‌ రిషభ్‌ జైన్‌ను ఓడించడం ద్వారా ఫైనల్స్‌కు చేరుకున్నాడు.

 

అయితే దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలో గౌర్‌ అద్భుతంగా రాణించి 1,600 స్కోర్‌ సాధించాడు..ఈ డబ్బు మొత్తాన్ని తన చదువు పూర్తి చేయడానికి, భవిష్యత్‌ అవసరాల కోసం ఈ మొత్తాన్ని దాచుకుంటానని గౌర్‌ పేర్కొన్నాడు. అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ క్విజ్‌ కార్యక్రమం అక్కడి టీవీ చానెళ్లలోనూ ప్రసారమవుతుంది..అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఇదే క్విజ్ పోటీలో గతంలో కూడా ఇద్దరు భారతీయులు గెలుపొందటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: