“అమెరికా ఎన్నికల” బరిలో “20” మంది భారతీయులు

Bhavannarayana Nch

భారతీయులు ఎక్కడ అడుగుపెట్టినా సరే వారికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది..ఎంతో మంది భారత సంతతికి చెందినా వాళ్ళు అగ్రరాజ్యంలో చక్రం తిప్పుతున్నారు..మేయర్స్ గా ప్రముఖ కంపెనీ సిఈవో లుగా ఎంతో ఉన్నతమైన స్థానాలలో వెలుగుతున్నారు..భారతీయులు ఉద్యోగ అవసరార్ధం వలన కానీ మరే ఇతర అవసరాల వలన కానీ విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ తమ చక్కని ప్రతిభ కనబర్చి అక్కడ పాతుకు పోవడం మనవారిలో ఉన్న గొప్ప లక్షణం..

 

ఎన్నో సేవాకార్యక్రమాల్ చేపడుతూ అక్కడ రాజకీయంగా కూడా ఒక వెలుగు వెలుగుతున్నారు ఎంతో మంది భారతీయులు అయితే తాజాగా భారత సంతతికి చెందిన  కొంతమంది ఈ సారి  ఏకంగా అమెరికాలో జరిగే కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలబడుతున్నారని తెలుస్తోంది వివరాలలోకి వెళ్తే..త్వరలో జరగనున్న అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో ఎప్పుడు లేనట్టుగా రికార్డు స్థాయిలో దాదాపు 20 మంది భారతీయ అమెరికన్లు బరిలో దిగనున్నారట..రానున్న నవంబరులో జరగనున్న ఈ ఎన్నికల కోసం వారంతా కలిసి ఇప్పటివరకు రూ.102 కోట్లకుపైగా నిధులు సమీకరించారు...గెలుపు ధ్యేయంగా వారు విస్తృత ప్రచారం కూడా చేస్తున్నారని తెలుస్తోంది.అయితే ఆ 20 మందిలో  ఏడుగురు రూ.7 కోట్లకుపైగా నిధుల చొప్పున సేకరించారట.

 

ఇదిలాఉంటే  అందరిలో కంటే అత్యధికంగా రాజా కృష్ణమూర్తి (డెమోక్రాట్‌) అత్యధికంగా సుమారు రూ.23 కోట్లు సమీకరించారుఈ  యన  ఇల్లినాయిస్‌లోని 8వ కాంగ్రెస్‌ జిల్లా నుంచి పోటీ చేయనున్నారు...రిపబ్లికన్‌ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్‌ జితేందర్‌ దిగాంకర్‌ ఆయనతో తలపడనున్నారు. కృష్ణమూర్తి ప్రస్తుతం ఇల్లినాయిస్‌ 8వ కాంగ్రెస్‌ జిల్లా నుంచే ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి గమనార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: