బ్రేకింగ్: “భారతీయుల కిడ్నాప్”..

Bhavannarayana Nch

ఎన్నో ఆశలతో విదేశాలు వెళ్లి చదువుకోవలని..డబ్బు సంపాదించాలని ఉన్నతమైన జీవితాన్ని గడపాలని వెళ్తున్న భారతీయులకి ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి..ఒక పక్క  జాత్యహంకార దాడులు మరొక పక్క దోపిడీలు.. హత్యలు ఇలా అనేక కారణాల వలన విదేశాలలో ఉండే భారతీయులకి రక్షణ లేకుండా పోతోంది..భారతీయులని కిడ్నాప్ చేయడం తరువాత అతి కిరాతకంగా చంపడం ఇరాక్,ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలలో సాయుధులకి సర్వ సాధారణంగా మారిపోయింది...అయితే తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన ఒక సంఘటన మళ్ళీ భారతీయులకి నిద్ర లేకుండా చేస్తోంది.

 

వివరాలలోకి వెళ్తే..తాజాగా జరిగిన సంఘటనతో భారతీయులకి ఆ ఇరు దేశాలలో భద్రత కోరవడుతోందనే చెప్పాలి..ఆప్ఘనిస్థాన్‌లోని బాగ్లాన్ రాష్ట్రంలో ఆదివారం రోజున ఏడుగురు భారతీయ ఇంజనీర్లను గుర్తుతెలియని సాయుధులు అపహరించుకు వెళ్లారు...వారితో పాటు ఒక ఆప్ఘన్ ఉద్యోగిని కూడా సాయుధులు ఎత్తుకెళ్లారు..అయితే వీరందరూ ఇండియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కేఈసీకి చెందిన ఉద్యోగులని తెలుస్తోంది.

 

అయితే ఈ ఏడుగురు భారతీయులకి ఆఫ్ఘనిస్తాన్ లో సొంతగా ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ ఉందని అయితే అందరూ కేఈసీ కార్యాలయానికి  వెళ్తుండగా వీరిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టు వార్తలు అందుతున్నాయి. అయితే ఈ కిడ్నాప్ సమాచారంపై కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ సంప్రదిస్తోంది...అయితే మరిన్ని వివరాల కోసం ఆప్ఘన్ అధికారులను సంప్రదిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: