“తెలుగు”...విద్యార్ధులకి తానా సాయం

Bhavannarayana Nch

అమెరికాలో ఉండే తెలుగు వారి సంక్షేమం కోసం తానా  ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) ఏర్పాటు అయిన విషయం  అందరి తెలుసు అయితే తెలుగు వారి సంక్షేమం కోసం తానా ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. అయితే ప్రతీ ఏటా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టే తానా ఈ సారి అమెరికాలు ఉంటూ చదువుకునే తెలుగు విద్యార్ధుల కోసం తమ వంతు సాయంగా స్కాలర్ షిప్‌లని అందిస్తోంది..ఎంతో ప్రతిభ కలిగిన విద్యార్ధులు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఆర్ధికంగా ఇబ్బందులని ఎదుర్కొంటూ ఉన్న వారికోసం తానా ఈ నిర్ణయానికి వచ్చింది.

 

2018-19 లో డిగ్రీ చదువుతున్న విద్యార్థుల కోసం...స్కాలర్‌షిప్ లకి గాను తానా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..ఏడూ రకాలుగా తానా ఈ  స్కాలర్ షిప్‌లని అందిస్తోంది..గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్‌ల రూపంలో ప్రతీ విద్యార్థికి  2000 డాలర్లను అందించాలని తానా ప్రతినిధులు నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన తెలుగువారు ఎవరైనా ఈ స్కాలర్ షిప్‌లను పొందవచ్చని తానా సభ్యులు తెలిపారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులు ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

 

అయితే సెమిస్టర్ పద్దతిలో అయితే ఒక్కో సెమిస్టర్ కి 500 డాలర్ల చొప్పున మొత్తం నాలుగు సెమిస్టర్లకు స్కాలర్‌షిప్ అందించనున్నారు..అయితే అమెరికాలోనే హైస్కూల్ చదువుని పూర్తీ చేసిన వారికి మాత్రం నాలుగు రకాలుగా ఈ స్కాలర్ షిప్‌ల ని అందించనున్నారు..వీరిలో ఒక్కొక్కరికి 1000 డాలర్లను స్కాలర్ షిప్‌గా ఇవ్వనున్నట్టుగా తానా సభ్యులు తెలిపారు..అయితే మరిన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకునే వారు క్రింది తెలిపిన ఈ –మెయిల్ కి ఈమెయిల్ చేయచ్చు అని తెలిపారు.

 

నిరంజన్ శృంగవరపు,

చైర్మెన్ తానా ఫౌండేషన్

2483426872

Chairman@tanafoundation.org 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: