ఏపీ “ఎన్నారై మహిళ” కి అరుదైన గౌరవం..

Bhavannarayana Nch

ప్రతిభ ఉన్నచోట భారతీయులు ఉంటారు..భారతీయులని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి..ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా సరే దర్జాగా బ్రతికేయగలరు భారతీయులు..ఎంతో ద్రుఢమైన సంకల్పం కలిగి ఉంటారు కాబట్టే జాత్యహంకారం తో రగిలిపోతున్న అగ్రరాజ్యంలో ఎన్నో ఏళ్లుగా అనేక రంగాలలో చక్రం తిప్పుతూనే ఉన్నారు..ఎన్నో ఉన్నతమైన పదవులని అలంకరిస్తూనే ఉన్నారు..తాజగా ఏపీ కి చెందినా మహిళా ఎన్నారై కి అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ లూయివిల్‌ లో అరుదైన గుర్తింపు లభించింది.. వివరాలలోకి వెళ్తే..

 

అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ లూయివిల్‌ 18వ అధ్యక్షురాలిగా ప్రవాసాంధ్ర మహిళ డాక్టర్‌ నీలిమ బెండపూడి నియమితులయ్యారు...ఏపీకి చెందినా నీలిమ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేసి పై చదువులకోసం అమెరికా వెళ్ళారు..విద్యాభ్యాసం తర్వాత అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత పదవులు అధిరోహించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ లూయివిల్‌ యూనివర్శిటీ ప్రథమ మహిళా ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. యూనివర్శిటీలో ట్రస్టీలు ఆమె నియామకాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.

 

అయితే తోటి ఎన్నారై  ఒక యూనివర్సిటీ కి అధ్యక్షురాలిగా ఎన్నికవ్వడంతో స్థానిక భారత  ఐటీ సంస్థల అధినేత పూర్ణ భాస్కర్‌, డాక్టర్‌ రాధిక వీరమాచినేని ఆమెకి అభినందన సభ ఏర్పాటు చేశారు. తెలుగు సంఘాల ప్రతినిధులు, సభ్యులు డాక్టర్‌ నీలిమకు శుభాకాంక్షలు తెలిపారు...నీలిమ దంపతులకు కెంటకీ తెలుగు సంఘం ఛైర్మన్‌ డాక్టర్‌ సురేశ్‌ కాసరనేని గౌరవ సభ్యత్వాన్ని ప్రకటించారు..

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: