“భారత సంతతి” శాస్త్రవేత్త అరుదైన.. “ఘనత”

Bhavannarayana Nch

భారతీయుల ప్రతిభ సామాన్యమైనది కాదు దేశవిదేశాలలో ఎంతో మంది భారతీయులు ఎన్నో కీలకమైన పదవులని అలంకరిస్తూ భారతీయుల ప్రతిభని చాటి చెప్తున్నారు...ప్రపంచ దేశాలు ఎంతో విలువైన జ్ఞాన సంపద ఉన్న తెలివైన వారిని ఎంపిక చేసుకుంటూ వారికి ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు అయితే ఈ క్రమంలోనే అమెరికా వంటి కీలక దేశాలలో వెలుగు చూసిన ఎన్నో ప్రయోగాలు మరెన్నో విజయాలలో భారతీయుల ప్రతిభ దాగిఉంది అనడంలో సందేహం లేదు..ఇదిలాఉంటే

 

ఎంతో మంది భారత సంతతి  వ్యక్తులు ఎన్నో గొప్ప గొప్ప విజయాల్ని అమెరికాలో చాటి చెప్తూనే ఉన్నారు అయితే తాజాగా భారత సంతతి వ్యక్తి అయిన చందర్ మోహన్ అమెరికాలో పెద్ద శాస్త్రవేత్తగా పేరొందారు..కొన్నేళ్ళ క్రితమే అమెరికా వచ్చేసిన చందర్ మోహన్ ఫ్యామిలీ అప్పటి నుంచీ అమెరికాలోనే నివాసం ఉంటున్నారు ఈ క్రమంలోనే..చందర్ మోహన్ అనే శాస్త్రవేత్త పేగు వ్యాధికి కారణాలని కనుగున్నారు..

 

దీనివల్ల అతిసారం, కడుపు తిప్పడం, బరువు తగ్గడం వంటి వ్యాధులకు కారణాలు తెలుసుకోవచ్చునని యూనివర్సిటీ ఆఫ్‌ హోస్టన్‌లో ప్రొఫెసరుగా ఉన్న చందర్‌ తెలిపారు. వాస్తవానికి ఈ వ్యాధిని గుర్తించాలంటే ఎండోస్కోపీ విధానంలో జీర్ణవ్యవస్థ దగ్గర భాగాలను సేకరించి పరీక్షలకి పంపుతారు..కానీ అలాంటి ఇబ్బందికరమైన పరీక్షలు లేకుండానే రుగ్మత గురించి తెలుసుకోవచ్చునని అంటున్నారు...చందర్ మోహన్.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: