ట్రంప్ హై సెక్యూరిటీ టీం లో భారత సంతతి వ్యక్తి..

Bhavannarayana Nch

అమెరికాలో ని భారత సంతతి వ్యక్తి అరుదైన గుర్తింపు పొందాడు..అమెరికాలోని ప్రతీ సైనికుడు కలగనే ట్రంప్ సెక్యూరిటీ పరిధిలోకి భారత సంతతికి చెందిన  అనీష్ దీప్ సింగ్ భాటియా చేరుకున్నారు..అంతేకాదు తన కలని ఇన్నాళ్ళకి సాకారం చేసుకున్నాను అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు..ఇంతకీ అతడు సాధించిన కల ఏమిటి..? ట్రంప్ సీక్రెట్ సెక్యూరిటీ ఏమిటి అనేకదా మీరు ఆలోచించేది సరే అసలు విషయంలోకి వెళ్తే..

 

అమెరికా అధ్యక్షుడిని కనీసం పది అడుగులు దూరం నుంచీ చూడాలంటేనే అతి అత్యంత కష్టమైనా విషయం.. ప్రపంచంలోనే అగ్రరాజ్యం అందులోనూ తనని కాదని ఏ దేశం కూడా ఏమి చేయలేని పరిస్థితి అలాంటి దేశానికి అధ్యక్షుడు అంటే మాటలా..అతడి మీద ఈగ వాలాలి అన్నా అతడి పర్సనల్ సెక్యూరిటీ అనుమతి ఉండాల్సిందే అయితే స్వదేశానికి చెందినా పౌరులు అయినా ఎవరైనా సరే అధ్యక్షుడు సెక్యూరిటీ టీమ్‌లోకి వెళ్ళాలంటే ఎన్నో కటోరమైన శిక్షణ తీసుకుని అందులో విజయం సాధిస్తేనే కాని దక్కదు అయితే

 

భారత సంతతికి చెందిన సిక్కు వ్యక్తి తొలిసారిగా ఈ అరుదైన అవకాశం సంపాదించాడు..లుధియానాకు చెందిన అన్ష్‌దీప్ సింగ్ భాటియా.. కఠినమైన శిక్షణ తర్వాత అతన్ని గత వారం ట్రంప్ సెక్యూరిటీ టీమ్‌లో నియమించారు. భాటియా కుటుంభం 1984  సిక్కుల ఊచకోత సమయంలో కాన్పూర్ నుంచి పంజాబ్‌లోని లుధియానాకు వలసవెళ్లింది. 2000వ  సంవత్సరంలో వీళ్లు అమెరికాకు వలస వెళ్లారు...అయితే అధ్యక్షుడి సెక్యూరిటీ టీమ్‌లో ఉండాలన్నదే తన లక్ష్యంగా పెట్టుకున్న అన్ష్‌దీప్.. మొత్తానికి అనుకున్నది సాధించి రికార్డులకెక్కాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: