భారతీయుడిని వరించిన భారీ లాటరీ..!!!

NCR

సహజంగానే భారతీయులకి టాలెంట్ తో పాటు లక్కు కూడా జేబూలోనే ఉంటుంది..ఎక్కడికెళ్ళినా సరే వారికి ఈ రెండు అండగా ఉంటాయి అఫ్కోర్స్ అది కూడా కొంతమందికి మాత్రమె అనుకోండి..అయితే దుబాయ్ ఉండే భారతీయులకి మాత్రం అడుగడుగునా లక్ పిలిచి మరీ షేక్ హ్యాండ్ ఇస్తుంది..అదేంటి అనుకుంటున్నారా సరే వివరాలలోకి వెళ్తే..

 


దుబాయ్ లో ప్రభుత్వం నిభంధనలకి అనుగుణంగా నిర్వహించే లాతరీలలో ఎప్పటికప్పుడు భారతీయులు సైతం ఎంతో కొంత మొత్తం గెలుచుకుంటూ ఉంటారు అయితే ఈ సారి ఓ భారతీయుడుకి మాత్రం కళ్ళు చెదిరేలా లాటరీ తగిలింది..దుబాయిలో పని చేస్తున్న కేరళకు చెందిన ఓ వ్యక్తికి జాక్ పాట్ తగిలింది.

 

యూఏఈలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీలో బ్రిట్జీ మార్కోస్ అనే వ్యక్తి దాదాపు రూ. 19.85 కోట్లు  గెలుపోందాడు. ఈ భారీ లాటరీ తగలడంపై బ్రిట్జీ సంతోషం వ్యక్తం చేశారు. గతన కొన్నేళ్లుగా బిగ్ టికెట్ కొనుగోలు చేస్తున్నానని ఇలా కొనుగోలు చేయడం ఇది ఐదో సారని తెలిపారు. గెలిచిన మొత్తంలో కొంత భాగాన్ని అప్పులు తీర్చేందుకు, మిగతా దాన్ని సొంత ఇంటి నిర్మాణానికి వినియోగిస్తానని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: