“అమెరికా పౌరసత్వం”....సాధించుకున్న “బామ్మ”

NCR

అమెరికాలో పౌరసత్వం అంటేనే అదొక పెద్ద కలగా మారిపోతోంది. అక్కడి రూల్స్ కి అనుగుణంగా పౌరసత్వం రావాలంటే ఎంతో ఖటినమైన పద్దతులు పాటించవలసి ఉంటుంది. వారు అడిగిన వారి ప్రకారం అన్ని రూల్స్ కి అనుగుణంగా ఉంటే పౌరసత్వం తప్పకుండా వరిస్తుంది కానీ ఆ రూల్స్ దాటుకుని రావడం అంటే ఎంత కష్టమో సంవత్సరాలు తరబడి ఈ పౌరసత్వం కోసం ఎదురు చూసేవారు కూడా లేకపోలేరు అయితే తాజాగా..

 

106 ఏళ్లు వయసున్న బామ్మకి అమెరికా పౌరసత్వం లభించింది..మంగళవారం జరిగిన మధ్యంతర ఎన్నికల సమయంలోనే ఆ బామ్మకి అమెరికా పౌరసత్వం అందచేసింది. దాంతో ఇప్పుడు ఈ న్యూస్ పెద్ద వైరల్ అయ్యింది. బామ్మా ఎట్టకేలకి సాధించింది అంటూ సోషల్ మీడియా లో ఆమె ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.

 

సల్వాడార్‌కు చెందిన మారియా వాల్లెస్ బొనిల్లా అనే బామ్మకు అమెరికా  పౌరసత్వం వచ్చింది...ఆమె చట్టపరంగా ఈ హక్కుని పొందటానికి అన్ని విధాలా అర్హులని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలుపుతూ ఆమోదం ఇచ్చారు. పౌరసత్వం జారీకి ముందు అధికారులు ఆమెను ఇంటర్వ్యూ చేశారు..పలు విధాలుగా ఆమెని విచారించిన తరువాత పౌరసత్వం జారీ చేశారు.దాంతో బామ్మ సంతోషానికి అవధులు లేవు..చనిపోయిన భర్త కల నెరవేరడంతో ఉధ్వేగానికి లోనయ్యింది .


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: