అమెరికాలో గరిమెళ్ళ కి గుర్తింపు..!!!

NCR

అమెరికాలో భారతీయలు ఉనికిని ప్రత్యేకంగా చాటుకోవాల్సిన అవసరం లేదు..ప్రతిభ ఉన్న కారణంగా భారతీయల ఎదుగుదల రోజు రోజు కి శిఖరాన్ని తాకుతోంది. ముఖ్యంగా అమెరికా కీలక కార్యకలాపాలలో భారతీయులకి చోటు కల్పించడమే ఇందుకు నిదర్సనమని చెప్పవచ్చు..అంతేకాదు. శ్వేతసౌధం లో ఎన్నో కీలక విషయాలలో భారత సంతతికి చెందిన ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు..

 

తాజాగా ఎంతో ప్రతిష్టాత్మకమైన అమెరికన్ నేషనల్ సైన్స్ బోర్డ్ సభ్యుడిగా ఇండియన్ అమెరికన్ ప్రొఫెసర్ సురేష్ వీ గరిమెళ్లను నియమించడంతో మనోళ్ళ ప్రతిభ మరో సారి విశ్వవ్యాప్తం అయ్యింది. గరిమెళ్ళ ని బోర్డ్ సభ్యుడిగా నియమించాలని ఉద్దేశంలో ట్రంప్ దాదాపు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది..

 

వైట్‌హౌస్ సమాచారం ప్రకారం మేరకు  మే 10వ తేదీ 2024 వరకు ఆరు సంవత్సరాల పాటు సురేష్ గరిమెళ్ల... జాతీయ సైన్స్ బోర్డు సభ్యునిగా ఎంతో విలువైన సేవలందిస్తారు. ఈ బోర్డులో ఉండే ఏడుగురు సభ్యుల్లో గరిమెళ్ల ఒకరు. ఈ బోర్డ్  ఎన్‌ఎస్‌ఎఫ్‌ యొక్క విధానాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: