అమెరికాలో తెలుగువారిని కలవర పెడుతున్న ఘటన..!!!

NCR

అమెరికాలో భారతీయులు అధిక సంఖ్యలు ఉంటారనే విషయం అందరికి తెలిసిందే. వీరిలో అధికశాతం తెలుగు వారు కూడా  ఉండటం మరొక విశేషం. అయితే తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే తెలుగు సంస్కృతీ, సాంప్రదాయలని మాత్రం నిత్యం పాటిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే అమెరికాలో చాలా ప్రదేశాలలో హిందూ దేవాలయాలు తెలుగువారు విస్తరింప చేశారు. అయితే

 

అమెరికాలో ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలలో జరుగుతున్న వరుస దొంగతనాలు తెలుగు వారిని కలవర పెడుతున్నాయి. మే 17న కమ్మింగ్‌లో శ్రీ మహాలక్ష్మి ఆలయం, అట్లాంటాలోని రివర్‌డేల్‌లోని ఆలయంలో 18న చోరీలు జరిగాయి. ఈ రెండు దేవాలయాల్లో ఒకే గ్యాంగ్ చోరీలకి పాల్పడినట్టుగా తెలుస్తోంది. పూజారుల కళ్ళు గప్పి మరీ వారు విగ్రాహాలకి అలంకరించిన బంగారు ఆభరణాలని చోరీ చేస్తున్నారు.

 

దేవాలయాల్లో చోరీ చేయడానికి మొత్తం ఆరుగురు కలిసి దొంగతనాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరిలో ముగ్గురు మహిళలున్నారు. హిందూ మతం ఆచార వ్యవహారాల గురించి పూజారిని అడుగి దృష్టి మరల్చగా, మిగతా వారు ఈ చోరీలకి పాల్పడుతున్నారు. అయితే ఈ చోరీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సీసీటీవీ పుటేజ్ లో వారిని గుర్తించినట్టుగా తెలుస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: