2-జి స్పెక్ట్రం కేసులో రాజా, కనిమోళి మళ్ళీ జైలుకే?

సి బి ఐ కేసు విచారణ సరిగా జరగలేదు. సి బి ఐ న్యాయస్థానం తీర్పులో కూడా న్యాయమూర్తి వ్యాఖ్యలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు ప్రజలు సైతం ఆర్కె నగర్ ఎన్నికల్లో కూడా డిఎంకే సానుభూతి పరంగా స్పందించలేదు. తీర్పు అనుకూలంగా వచ్చినా ప్రజలు డిఎంకె కి ధరావత్తు కూడా దక్కని ఓటమిని ప్రసాధించారు. దీంతో మాకు తెలుసు లేవోయ్ మీ నిజాయతీ అన్నట్లు ప్రజలు ఎవరూ స్పందించలేదు అనేకంటే "నో బడీ బాథర్స్ అబౌట్ ది జడ్జెమెంట్" ఇంకా క్లియర్ గా చెప్పాలంటే తీర్పును ఖాతర్ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నైనా పరువు నిలుపుకోవాలంటే సి బి ఐ మరియు ఈ డి లు జాయింటుగా ఉన్నత న్యాయస్థానం లో అప్పీల్ చేయాల్సిందె. 


 2జి స్పెక్ట్రం కేసులో మొన్న పటియాలా హవుజ్ సి బి ఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ద్వారా బయటపడ్ద నిందితులకు త్వరలోని “పునఃకారాగారవాస ప్రాప్తిరస్తు” అంటున్నారు తమిళనాడు పిఎంకె అధినేత డాక్టర్ డాక్టర్ అంబుమణి రాందాస్. 


 2జీ స్పెక్ట్రం పై సుప్రీంకోర్టులో ప్రశాంత్‌ భూషణ్‌ దాఖలు చేసిన కేసు విచారణకు రానున్న సమయం లో ఒక ఊహించని మలుపు ఉంటుందని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌ పేర్కొన్నారు. ఆయన సేలంలో సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ, 2జీ లైసెన్స్‌ కేటాయింపు విధానంలో నిబంధనలను పాటించాలని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సూచించారని, అయితే నిర్ణీత సమయంలో వచ్చినవారికి కేటాయింపు పేరుతో 122 సంస్థలకు తక్కువ ధరకు కేటాయించా రని, ఇందులో 'స్వాన్‌ సంస్థ తన వాటా కింద పొందిన 45 శాతాన్ని, 590 శాతం అధిక ధరకు విక్రయించిందని, అదేవిధంగా యునిటెక్‌ సంస్థ తన వాటా కింద పొందిన 60 శాతాన్ని, 703 శాతం అధిక ధరకు విక్రయించిందని, ఇందువల్ల ప్రభుత్వానికి రూ.44,100 కోట్ల నష్టం వాటిల్లింద ని కేసు నమోదైందని' ఆయన తెలిపారు.


అయితే ఇందులో ఒక్కరు కూడా లబ్ధిపొందలేదని, ఎటువంటి ప్రతిఫలం లేకుండా ప్రైవేట్‌ టీవీ ఛానల్‌కు రూ.200 కోట్లు ఇస్తా నని "స్వాన్‌" సంస్థ ప్రకటించడం వాస్తవం కాదా?  అని రాందాస్‌ ప్రశ్నించారు.


కొన్నేళ్ల క్రితం ఇంటిలిజెన్స్‌ శాఖ ఛైర్మన్‌ జాఫర్‌ షేక్‌, డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సహాయకుడు షణ్ముఖనాథన్‌ల మధ్య టెలిఫోన్‌లో 2జీ కుంభకోణం గురించి సాగిన చర్చలపై విచారణ జరపాలని కోరుతూ సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ ప్రశ్నలు లేవదీశారని, దీనికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత డీఎంకే దేనన్నారు. ప్రశాంత్‌భూషణ్‌ దాఖలు చేసిన కేసు విచారణకు వచ్చిన సమయంలో 2జీ స్పెక్ట్రం కేసు లో తప్పక అనుకోని మలుపు ఉంటుందని, దాంతో నేడు నిర్దోషులుగా విడుదలైన వారు కటకటాల వెనక్కు వెళ్లడం తథ్యమని డాక్టర్ రాందాస్‌ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: