రేపోమాపో చంద్రబాబుపైనా దాడులు జరిగేది నిజమే నంటున్నారు జనం!

చంద్రబాబు చాలా విచిత్రంగా మాట్లాదతారు. తానేమైనా రాజ్యాంగానికి అతీతులా? తను నిప్పంటారు తనను టచ్ చేస్తే భస్మీపటలం అయిపోతారని అంటారు. తను నీతి మంతుణ్ణంటారు. నిజాయతీ తన శ్వాస అంటారు. అయినా: రేపో మాపో తనపై కూడా దాడులు జరుగుతాయని తెలుసని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 40 ఏళ్లుగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని, ఏనాడూ తప్పు చేయ లేదని స్పష్టం చేశారు. టీడీపీ నేతల వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించారని, బీజేపీని వ్యతిరేకించే రాజకీయపార్టీల నేతలను కేసుల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ నేత రేవంత్‌ రెడ్డి సహా అనేక రాష్ట్రాల్లో ఇదే జరుగుతోందని చెప్పారు.

"అంటే చంద్రబాబు నేఱస్తుడనేగా అదే ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. ఏ తప్పు చేయనప్పుడు మీరు ప్రతి సారి నిప్పునని సంజాయిషీ లు ఇవ్వాసిన పనిలేదు కదా! టిడిపి నేతలంతా వ్యాపారులు చేస్తారా? ప్రజాసేవ ముసుగులో వ్యాపారాలు చేయకూడదు కదా! ఐటి దాడులు జరిగిన వ్యాపార సంస్థలన్నీ టిడిపి నేతలవేననేకదా అర్ధం! ఐతే పన్నులు ఎగవేత నిజం కానప్పుడు న్యాయస్థానాలలో పోరాడండి. ఆ వ్యాపార సంస్థలకు ప్రజలకు సంబంధంలేదు. కాని ఈ వ్యాపార సంస్థలపై దాడులు ఏపి పై దాడులెలా ఔతాయి? ప్రజలకు టిడిపి వాళ్ళ వ్యాపారాలకు సంభందమేమిటి? "  అమరావతిని అవమానాల పాలుచేస్తున్న సందర్భంగా అక్కడి ప్రజల ఆక్రందన ఇది

"మేం బీజేపీ తో స్నేహం చేసినన్ని రోజులు, మాకు పన్ను ఎగవేత నోటీసులు రాలేదు. బీజేపీతో విడిపోగానే 19 బృందాలతో ఐటీ దాడులు చేయించారు. విభజన చట్టం అమలుపై విబేధించినంత మాత్రాన వేధిస్తారా? దేశంలో లౌకికవాదానికి ప్రమాదం వాటిల్లుతోంది. ప్రధాని, అధికార పార్టీ అధ్యక్షుడు ఒకే రాష్ట్రంవారు ఉండకూడదు. కేంద్రంలోని కీలక పదవుల్లో మొత్తం గుజరాతీలే ఉన్నారు. తమకు నచ్చనివాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు" అని చంద్రబాబు మండిపడ్డారు.

"ఎప్పుడూ మీరిలా మాట్లాదలేదే? మోడీ బిజెపి ప్రభుత్వం దాని పాలన అద్భుతమన్నారే? బిజెపితో మైత్రి నెఱపిన రోజుల్లో బిజెపి మీద ఈగ వాలనివ్వలేదే? అప్పటి లౌకికం మీరు NDA నుండి బయటికి రాగానే అలౌకికమైందా? మీకు నోటీసులు రాగానే నొప్పనిపించిందా? ప్రజలలో అనేక మందికి నోటీసులు వస్తే దానికి వ్యతిరేఖంగా స్పందించలేదే? మీ టిడిపి వ్యాపారస్తులు ప్రజలకంటే ఎక్కువా? అదేనా మీ వాచాలతకు కారణం? కేంద్రం నిండా గుజరాతీలే ఉంటే మన రాష్ట్రం నిండా కమ్మవారే ఉన్నారుగా? దానికి కూడా సంజాయిషీ ఇవ్వండి. మీ పాలనలో మీకొక నీతి — మీ ప్రజలకొక నీతా? ఇదెలా న్యాయం? నరెంద్ర మోడీని మీరే మెచ్చి మా నెత్తిన పెట్టారుగా మీ జిల తీర గానే మా తీట గూడా తీరాలని రూలు ఉందా?" ఇది ఆంధ్రప్రదెశ్ అంతటా మార్మోగుతున్న జనఘోష
 
ఆంధ్రప్రదేశ్ లో అస్థిరత నెలకొనేలా చేస్తున్నారని, ప్రతిపక్ష నేత జగన్‌మోహనరెడ్డిపై దాడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైతే, రాష్ట్రానికేంటి సంబంధమని ప్రశ్నించారు. టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొందని గుర్తు చేశారు. సీబీఐ వివాదంలో నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సీబీఐ లో అధికార కేంద్రాలను మీరు ఎలా ప్రోత్సహిస్తారని నిలదీశారు. సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ ఆస్థానా సహా అనేక మంది గుజరాతీలే నని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థలను నాశనం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ముందు మనం ఆలోచించాల్సింది ఇవా? హవ్వా! ఎంత సిగ్గుమాలిన తనం? ప్రతిపక్షనేత ప్రజల్లో ఒకడేగా? ఆయన ఆరోగ్యం గుఱించి ఒక సారి కూడా అలోచించకుండా అలా కక్ష కార్పణ్యాలను ప్రదర్శిస్తారేమిటి ? మీ సుధీర్ఘ రాజకీయ అనుభవసారం ఇదేనా? విచక్షణ లేదా మీకు? ఎన్నో సంక్షోబాలను ఎదుర్కొన్న టిడిపిని నాడు కాపాడింది ప్రతిపక్షాలే! అందులో బిజెపిది ప్రధాన పాత్ర కాదా! మిమ్మలని గవర్నర్ రాంలాల్ పేరుతో వంచించింది కాంగ్రెస్ కాదా! మరిప్పుడు వారికి ₹500 కోట్లు సమర్పించి టిడిపి పాదాక్రాంతమవటం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సహించగలరేమో గాని తెలంగాణా వాసులు క్షమించరు. ఈ దెబ్బతో టిడిపితో అక్రమ సంబంధంతో -గెలిచే అవకాశాలున్న కాంగ్రెస్, టిజె ఎస్ రెండూ కలసి టిడిపితో భూస్తాపితం కావటం తధ్యం. ప్రజలిక్కడ 'ఓటు కు నోటు' పేరుతో ఎమెల్యెల తలకాయల వ్యాపారం చవి చూశారు కదా! సిబిఐ లో మోడీ అధికార కేంద్రాలు సృష్టిస్తే న్యాయవ్యవస్థలో మొత్తం మీ కులపోళ్ళనే,  మీ ప్రాంతం వాళ్లనే చేర్చిన మీ నీతి బ్రతుకెంత! వ్యక్తిగత ప్రయోజనాల గుఱించి మీరు మాట్లాడటం న్యాయమా? మీ కొడుకునే మంత్రిని చేశారు - మీ బామ్మర్ది సినిమాకే "వినోదపు పన్ను రద్ధు చేశారు - ఎమెల్యే రోజాని తొక్కేసి - మీ కోడలికే మహిళాసాధికారతలో స్థానం కల్పించారు - ఇవి ప్రజా ప్రయోజనాలా? మీరు బిజెపి మోడీ వైపు, వైసిపి జగన్ వైపు, జనసేన పవన్ వైపు ఒక వేలు చూపితే మిగిలిన మీ వేళ్ళు మీవైపే గురిపెడతాయి - కాదా? మీరు దేశం మొత్తం లోని ప్రతిపక్షాలను ఐఖ్యం చెస్తే మీ తల్లోనించి పుట్టిన మోడీ ఏపిలో ప్రతిపక్షాలను ఐఖ్యం చేసి మీ పార్టీకి తలకొరివి పెట్టడా? మీరిద్ధరు విడివిడిగాను కలసి కూడా ఏపి ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళే కదా!" 
ఇది ఉభయ తెలుగురాష్ట్రాల ప్రజల భావన - ప్రత్యేకించి తెలంగాణా బాబును బాబు సామాజిక వర్గాన్ని క్షమించదని అంటున్నారు

దేశంలో తొలిసారి మోదీ పూర్తిస్థాయి మెజార్టీ సాధించారని, ఇలాంటి సందర్భంలో ప్రజలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. దేశానికి ఏకపార్టీ అధిపత్యం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యవ్యవస్థలో ఉన్నామని, నియంతృత్వపాలనలో లేమన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్రం నియంత్రిస్తోందని, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విలువలు పాటించడంలేదని చంద్రబాబు మండి పడ్డారు.


మీరూ ఏపి ప్రజలకు బరోసా కల్పించలేదు ...మోడీ పాపం ఎంత పరాకాష్టకు చేరిందో...అంతకు మించి మీ పాపం తారామండలానికి చేరిందని మనవి. ఇక నియంతృత్వం, ప్రజాస్వామ్యం,  వ్యవస్థల నిర్వీర్యం, విలువలు గురించి మీరు మాట్లాడితే జనం నోటితో కాకుండా  ఇంకాదేని తోనో నవ్వుతారు....ఇక మీరు మూసుకోండి....మోడీ మూసుకోవాలి .... నోరు —
ఇది తెలుగుప్రజల హృదయాంతరంగ తరంగాలు 


ముందు జగన్ ఆరోగ్యం చూడండి ఆయన క్షేమమే మీ క్షేమం... మీ పార్టీ క్షేమం.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: