నేడు చంద్రుణ్ణి నడిపిస్తున్న 'జగన్' నాటక సూత్రధారి!

గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు అని భావించి చాలామంది రాజకీయాలతో సంబంధంలేని తటస్తులు ఆయనకు ఓటేసినవాళ్ళలో ఉన్నారు. ఇలాఎందుకన వలసి వచ్చిందంటే నాడు వైసిపి ఎన్నికల బరిలో ఉన్నా అనుభవం లేదన్న కారణంగా జగన్మొహనరెడ్డి నాయత్వానికి ఓటేయలేదు. రాజకీయంగా పార్టీలకు అనుసంధానం ఉన్న వాళ్ళను ఇక్కడ ప్రశ్నించట్లేదు.

అనుభవం కారణంగా చంద్రబాబును గెలిపించిన వారు ఇప్పుడు అర్ధం చేసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు మన రాష్ట్రంలో మనలను దహించి వేస్తున్న విషయం ప్రత్యేక తరగతి హోదా “స్పెషల్ కేటగిరీ స్టాటుస్”  వారు ఎవరైనా ఉంటే వారు ఈ అంశాలను గమనించాలి.  పాలనలో అన్నుభవం కంటే ప్రజా సేవ చేయాలన్న తపన అవసరం. అనుభవం అనేది చాలా చిన్న విషయం దానికి అధికారుల సహకారం ఉండనే ఉంది. కావలసింది నిసిత పరిశీలన ఆచరణపై నియంత్రణ 

లీడర్ తను నమ్మిన విధానాల దారుల్లో శత్రువుని సైతం నడిపించే వాడు జగన్ అదే పని చేస్తున్నాడు---నరెంద్ర మోడీ ముందే గ్రహించి ఎప్పుడో చెప్పాడు చంద్రబాబుకి జగన్ ట్రాప్ లో పడ్దావని.  


అనుభవఙ్జుడైన చంద్రబాబు నాయుని పాలనలో రాష్ట్రం అనాధ కాగా ఆయన కేంద్రానికి వ్యతిరేక్ష సదస్సులు నిర్వహించటంలో నిమగ్నమయ్యారు. సున్నితంగా నడిపించవలసిన విషయాల్లో అనుభవం పరిఙ్జానం అహంభావం సీనియారిటీ జూనియారిటీ అంటూ ఇంటర్ పర్సనల్ రిలేషణ్స్ ను విచ్చిన్నం చేసుకొని సిచుయేషన్ ను హార్డ్ నట్ టు క్రాక్ లాగా మార్చేశాడు. ఇప్పుడు ఆయన అనుభవం ఏమిటో? ఆయన తీరు ఏమిటో? గతంలో ఆయనకు ఓటేసిన వారందరికి అర్థమైపోయింది ఆ విషయంలో సందేహం లేదన్నది అందరికి తెలిసిన విషయమే.  
చంద్రబాబు అనుభవం రాష్ట్రాన్నిమరింత ఇబ్బందుల్లోకి నెట్టగా ఉపయోగం అనేది కలికానికి కూడా కనిపించక పోయిందని గ్రహించాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఒక్కొక్క పనీ “జగన్ ను రిఫర్ చేస్తూ ఉంది. జగన్మోహనరెడ్డి ఏ ఏ అంశాలను పాయింట్ అవుట్ చేస్తూ వచ్చాడో వాటిని ఇప్పుడే చంద్రబాబు నాయుడు వాటినే అనురిస్తూ వస్తున్నాడు. ఒకటని కాదు అన్నీ అంతే. 


ఉదాహరణకు ప్రత్యేకహోదా ఇవ్వని కేంద్రప్రభుత్వంలో తెలుగుదేశం ఎందుకు కొనసాగుతోంది, బయటకు రావాలని రెండు మూడేళ్ల కిందటే అన్నాడు. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు అందుకు ఒప్పుకోలేదు. చివరకు అదే చేశాడు.  జగన్మోహనరెడ్డికి ఏమీ తెలియదని, అనుభవం లేదన్న చంద్రబాబు నాయుడు తర్వాతి కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్ చెప్పినట్లే ఎన్డిఏ నుండి వైదొలిగాడు.


రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రాణమని అప్పట్లోనే జగన్మోహనరెడ్డి ఎప్పుడూ స్పష్టం చేస్తూ వచ్చాడు. ప్రత్యేకహోదా తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నాడు. అయితే అప్పుడు హోదా అవసరం లేదని బల్లగుద్ది చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని ప్రత్యక్షంగా యూటర్న్ తీసుకున్నారు బాబు. ప్రత్యేక హోదా అంటే జైలుకే అని హెచ్చరించిన ఈ పెద్దమనిషి ఇప్పుడు ప్రత్యేక హోదా పోరాటం అంటున్నాడు. ప్రత్యేక హోదా పై గతంలో పెట్టిన కేసులు ఎత్తేస్తాము అతున్నాదు ఇలా ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు నాయుడు కొత్త అవతారం ఎత్తాడు.  

జగన్మోహనరెడ్డి నవరత్నాలుగా ప్రచారం చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు ఇప్పుడు మక్కికి మక్కి కాపీ కొడుతున్నాడు. జగన్మోహనరెడ్డి  ప్రత్యేకించి చెప్పిన అంశాలను అప్పుడు అనుభవఙ్జుణ్ణి అన్న అహకారంతో అప్పుడు కాదని, ఇప్పుడు పరోక్షంగా ఔనని, బయటకు చెప్పటానికి అహంభావం అడ్డొచ్చి కుతకుత లాడుతున్నారు. ప్రత్యేకహోదా అన్న వారిపై నాడు చంద్రబాబు నాయుడు తన పోలీసులతో లాఠి చార్జ్ చేయించాడు, కేసులు పెట్టించాడు, జైళ్ళలో కుక్కించాడు. ప్రత్యేకహోదా పై విద్యార్ధులతో జగన్మోహనరెడ్డి యూనివర్సిటీల్లో సదస్సు లు పెడితే చంద్రబాబు సహించలేకపోయాడు. ఆ సదస్సుల్లో పాల్గొన్న ప్రొఫెసర్లను చంద్రబాబు సస్పెండ్ చేయించాడు.


అలా అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. రాష్ట్రాన్ని మోసం చేయడంలో చంద్రబాబుకు బీజేపీతో సమాన బాగస్వామ్యం ఉంది. అలాంటి ఛంద్ర బాబు ఇప్పుడు రాష్ట్రం, ప్రత్యేక హోదా, చిత్తశుద్ధి అని మాట్లాడటం మాట్లాడటం విడ్డూరంగా అంతకు మించి అసహ్యంగా ఉందని ప్రజలే అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: