ఇదంతా చంద్రబాబు మహా ప్రసాదం! ప్రతిపక్షాల దురదృష్టం!

సార్వత్రిక ఎన్నికల్లో గెలిచింది బిజేపి కాదు ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే. ఓటర్లలో అంతర్లీనంగా చాపకింద నీరులా వ్యాపించి ఉన్న ఆయన ప్రభంజనాన్ని గుర్తించి "మోడీ-షా" ఇద్దరూ దాన్ని వ్యూహాత్మకంగా మలుచుకొని బీజేపి విజయానికి బాటలు వేశారు. కారణం నరేంద్ర మోడీ పథకాలు వైఫల్యం చెంది ఉన్నా ఆయన తాను నిర్దేశించుకొని చేసిన చట్టాలను  పధాకాలను దృఢచిత్తంతో అమలు చేయించిన తీరు - ఆయనలోని స్తైర్యానికి ప్రజలను ఆకర్షితులయ్యారు. 

అందుకే శాసనసభ ఎన్నికల్లో ఎన్డిఏ ఓడిపోయిన రాజస్థాన్, మద్యప్రదేశ్, చత్తిస్-గడ్ లాంటి రాష్ట్రాల్లో కూడా, లోక్ సభ ఎన్నికల్లో జనం ప్రధాని నరేంద్ర మోడీని చూసి ఓటు వేయబట్టే 352 స్థానాల్లో ఘనవిజయం సాధించగా ఇందులో 303 స్థానాలు బిజేపి ఒంటరిగా గెలిచింది. ఈ సందర్భంగా చెప్పొచ్చేదేమంటే రాష్ట్రాల్లో ఎవరు గెలిచినా! దేశం కోరేది మాత్రం నిర్ద్వంధంగా నరేంద్ర మోడీ నాయకత్వాన్నే అని ఋజువైంది. 
  
ముఖ్యంగా ఏపి గుఱించి చెప్పేటప్పుడు ఎన్నికలు జరగటానికి ఒక సంవత్సరానికి ముందే తన వైఫల్యాన్ని ముందుగానే ఊహించి ఎన్ డీఏ నుండి బయటకు వచ్చిన చంద్రబాబు తన వైఫల్యాన్ని మొత్తం బిజేపిపైకి గట్టిగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీపైకి నెట్టేయటానికి తన సర్వశక్తులు, నలభై సంవత్సరాల రాజకీయాల్లో నేర్చిన కుట్రలు కుతంత్రాలు అనే ఆయుదాలు వాదేసి తన శకుని నీతిని, శల్య సారధ్యాన్ని ఫణంగా పెట్టారు. చివరకు రాష్ట్రంలో దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ సారధ్యంలోని బీజేపి ఓటమికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాలను వాడేసి తాను తన వ్యక్తిత్వాంతో పాటు రాజకీయాల్లోను పతనమయ్యారు. ఇదంతా చెప్పాలంటే మహా భారంలోని ఒక పర్వమంతైనా ఉంటుంది. 
 
ఇప్పుడు బేజేపి చంద్రబాబు విషయంలో తన స్టాండ్ ను నిర్దేశించుకుంది. రాష్ట్రంలో చంద్రబాబుతో రెండుసార్లు పొత్తు పెట్టుకుని బీజేపీ తీవ్రంగా నష్టపోయిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయం లో సోమవారం జరిగిన కార్యక్రమంలో టీడీపీ, జనసేనకు చెందిన పలువురు మండలస్థాయి నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ 1999 లో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి గాలి వీస్తున్న రోజుల్లో, 2014 లో నరేంద్ర మోదీ గాలి వీస్తున్న సమయంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని రెండుసార్లు బీజేపీ దెబ్బతిందని చెప్పారు.

నాలుగున్నరేళ్ల పాటు కేంద్రం నుంచి లక్షల కోట్ల రూపాయిల నిధులు తీసుకుని, వాటిని ఇతర నిర్దేశించిన పనులకు కాకుండా తన స్వార్ధపరత్వానికి వేరే రంగాలకు మళ్ళించి అవినీతికి పాల్పడి ఇప్పుడు కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయలేదంటూ తప్పుడుప్రచారం పదేపదే గోబెల్ లాగా ప్రచారం చేశారన్నారు. దీన్ని ప్రజలు నమ్మకుండా వాస్తవాన్ని తెలుసుకున్నారు కాబట్టే నేడు అనేక మంది బీజేపీలో చేరేందుకు "క్యూ" కడుతున్నట్లు వెల్లడించారు. 

అలాగే హైదరాబాద్‌లో పదేళ్లు ఉండే అవకాశం ఉన్నా ఓటుకు నోటు కేసులో దొరికిపోయి రాత్రికి రాత్రి చంద్రబాబు  అమరావతికి పారిపోయి వచ్చారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదనే విషయం తెలిసినప్పటికీ అన్ని పార్టీలు ప్రజలను సెంటిమెంట్‌తో మభ్యపెట్టి మోసగించాయని చెప్పారు. చంద్రబాబును నమ్మి కూటమి కట్టిన రాహుల్ గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అటు తెలంగాణాలోను, ఇటు దేశ వ్యాప్తంగాను రాజకీయంగా దివాళా తీశారు.

అలాగే పశ్చిమ బెంగాల్ వెళ్ళి మమతను రెచ్చగొట్టి ఆమె స్వక్షేత్రంలో ఆమె పతనమార్గంలో పయనించేలా చేశారు. అలాగే పిచ్చిపట్టినట్లు చంద్రబాబు వెంట నడచిన అరవింద్ కేజ్రీవాల్ తన గౌరవప్రతిష్టలు కోల్పోయి రాజకీయ బికారిలా మిగిలాడు. అలాగే ఉత్తరప్రదేశ్ లో మాయావతి అఖిలేష్ ల పరిస్థితి దీనికి  భిన్నంగా ఏమీలేదు. బిహారులో లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబ పరిస్థితి మరింత దయనీయమైంది.

ఇప్పుడు ఏపిలో బయటపడుతున్న ఒక్కో కుంభకోణం మాజీ ముఖ్యమంత్రి నారా చాంద్రబాబు నాయుణ్ణి ఏ తీరాలను చేరుస్తుందో? నని అంటున్నారు. ఇంతకు మించిన ప్రమాదం చంద్రబాబుకు ముంచుకు వస్తుంది. బిజేపికి చేసిన అన్యాయానికి బదులు తీర్చుకునే పనిలో ఉన్నట్లున్నారు మోడీ-షా లు అదే తెలుగుదేశం పార్టీని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నామరూపాలు లేకుండా చేయబోతున్నారని వినికిడి.

ఏపిలో  వైసీపిలో చేరటం ఇష్టంలేని టిడీపి, జనసేన శక్తులు బిజేపి తో చేయి కలపనున్నారు. అలాగే తెలంగాణాలో బిజేపి మళ్ళా పుంజుకోవటం మొదలైంది. నాయకత్వం లేని టి-టిడిపి వర్గాలు, కాంగ్రెస్ వర్గాలు టీఆరెస్ కు వ్యతిరేఖంగా సమీకృతమవటానికి సమాయత్తమౌతున్నాయి. బీజేపి వైపే చూస్తున్నాయి. బహుశ 2024 నాటికి కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాలను బీజేపి పూర్తిగా కబ్జా చెసే సూచనలు కనిపిస్తూనే ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. అంతా చంద్రబాబు మహా ప్రసాదం మే కదా! ఇది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: