భయంకరం: కోజికోడ్ విమాన ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణం.. వెలుగులోకి వాస్తవాలు..?

Chakravarthi Kalyan
నిన్న కేరళలోని కోజికోడ్ లో జరిగిన విమాన ప్రమాదం గురించి షాకింగ్ వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 19 మంది వరకూ మృతి చెందినట్లు పౌర విమానయాన శాఖ అధికారులు ప్రకటించారు. కోజికోడ్ చుట్టుపక్కల 13 వేర్వేరు ఆసుపత్రులలో 171 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో చికిత్స పొందుతున్న గర్భిణీ స్త్రీ, నలుగురు పిల్లలతో సహా మొత్తం 23 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. విమాన ప్రమాదంపై రెండు విచారణ కోసం నియమించిన బృందాల్లో ఒకటి కోజికోడ్ చేరుకుంది.

అయితే ఇప్పటి వరకూ ఈ ప్రమాదానికి వాతావరణం అనుకూలించకపోవడం కారణం అని అంతా భావించారు. కానీ.. అసలు వాస్తవం అది కాదని తెలుస్తోంది. కోజికోడ్ విమానశ్రయ నిర్వహణలోపాల కారణంగానే ప్రమాదం జరిగినట్టు ఇప్పుడు దర్యాప్తులో తెలుస్తోంది. ఎందుకంటే.. కోజికోడ్  అంతర్జాతీయ విమానాశ్రయం సరైన నిర్వహణ, భద్రత చర్యలు పాటించడం లేదని  ఓ ఏడాది క్రితమే డీజీసీఏ కోజికోడ్ విమానాశ్రయానికి షో కాజ్ నోటీసు జారీ చేసిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

కోజికోడ్ విమానాశ్రయాన్ని 2019 జులై 4, 5 తేదీల్లో పరిశీలించిన డీజీసీఏ అధికారులు  11న ఈ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. వాటర్ లాగింగ్, పగుళ్లు, స్కేల్ మించిన వాలు, రబ్బరు నిక్షేపణ వంటి నిర్వహణ లోపాలు ఉన్నాయని నోటీసులో తెలిపారు. డిజిటల్ డిస్‌ప్లే, దూర సూచిక పవన సామగ్రి కూడా పని చేయడం లేదని నోటీసులో డీజీసీఏ అధికారులు పేర్కొన్నారు. ప్రమాణాల ప్రకారం విమానాశ్రయం నిర్వహణ జరగడం లేదని హెచ్చరించారు.

ఇది జరిగి ఏడాది అవుతున్నా కోజికోడ్ విమానాశ్రయ అధికారులు మేలుకోలేదని తెలుస్తోంది. విమానాశ్రయం యొక్క సంబంధిత స్థానిక విభాగం సకాలంలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన చర్యలు తీసుకోవడంలో కూడా వారు విఫలమయ్యారని డీజీసీఏ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి విమానాశ్రయ అధికారుల నిర్వహణ వైఫల్యమే ఇంతటి ఘోరానికి దారి తీసిందని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: