కారు కొనుగోలుపై రూ.లక్ష బంగారం గెల్చుకునే అదిరిపోయే ఆఫర్..!
అంతేకాక నిస్సాన్ కిక్స్ టర్బో కారు కొనుగోలుపై కస్టమర్లు ఎక్స్చేంజ్ కింద రూ.40 వేల వరకు తగ్గింపు పొందొచ్చునని తెలిపారు. ఇక లాయల్టీ ఆఫర్ కింద మరో రూ.15,000 తగ్గింపు లభిస్తుందని తెలిపారు. ఇక కార్పొరేట్ ఆఫర్ కింద మరో రూ.10 వేల తగ్గింపు సొంతం చేసుకోవచ్చునని వెల్లడించారు. ఇక మొత్తంగా రూ.65 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చునన్నారు. ఈ ఆఫర్లు మాత్రమే కాకుండా కారు కొనుగోలుదారులకు లక్కీ డ్రా కూడా ఉంటుందన్నారు. ఇందులో విజేతగా నిలిచిన వారికి రూ.లక్ష వరకు బంగారాన్ని అందిస్తారు. సెప్టెంబర్ నెలలో లక్కీ డ్రా నిర్వహిస్తారని తెలిపారు. ఆగస్ట్ నెలలో కారు కొన్నవారికి ఇది వర్తిస్తుందని తెలిపారు.
అంతేకాకుండా టెస్ట్ అండ్ విన్ 100% క్యాష్‌బ్యాక్ అనే ఆఫర్ కూడా ఉందని తెలిపారు. కారు టెస్ట్ డ్రైన్ చేసి ఫీడ్ బ్యాక్ ఇచ్చి కారు కొనుగోలు చేసిన వారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉందన్నారు. ఇలా ఫీడ్ బ్యాక్ ఇచ్చిన వారికి కూడా లక్కీడ్రా ఉంటుంది. విజేతగా నిలిచిన వారికి 100 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఆగస్ట్ 31 వరకే ఈ ఆఫర్లన్నీ అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే ఆఫర్లు ప్రాంతం, షోరూమ్ ప్రాతిపదికన మారొచ్చునని నిపుణులు వెల్లడించారు.