ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త ఏడాది కానుక.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..?

praveen
జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది జగన్ సర్కార్. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఔట్  సోర్సింగ్ ఉద్యోగుల అందరికీ కూడా ప్రయోజనం చేకూరే విధంగా డిసెంబర్ నెలలో కీలక నిర్ణయం తీసుకుని శుభవార్త చెప్పింది. ఔట్  సోర్సింగ్ ఉద్యోగులు  అందరికీ కూడా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఇంతకుముందు వరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి బస్సు పాస్  సౌకర్యం ఉండేది కాదు.

 ఒకవేళ ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్లాలి అన్న కూడా ఆర్టీసీ బస్సులో  టికెట్ తీసుకోవాల్సి వచ్చేది..  కానీ ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం బస్సు పాస్ సౌకర్యం ఉంటుంది అన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే తమకు కూడా బస్సు పాస్  సౌకర్యం వస్తే ఎంత బాగుండు అని కోరుకోని  ఔట్సోర్సింగ్ ఉద్యోగి  లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే జగన్మోహన్రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ కూడా శుభ వార్త చెప్పింది. డిసెంబర్ నెలలోనే ఔట్ సోర్సింగ్  ఉద్యోగులు అందరికీ కూడా ఉచిత బస్ పాస్ అందించాలని నిర్ణయించింది.

 ఇటీవలే ఈ ఏడాది నూతన సంవత్సర కానుకగా రోడ్డు రవాణా సంస్థ లో పనిచేసే ఔట్ సోర్సింగ్  సిబ్బంది అందరికీ కూడా ఉచితంగా బస్ పాస్ ల పంపిణీ చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబు ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ కూడా ఉచిత బస్ పాస్ లు అందజేశారు. ఉచిత బస్సు పాసులతో  రోడ్డు రవాణా సంస్థ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఇంటి నుంచి దాదాపు 25 కిలోమీటర్ల మేర వర్తిస్తాయి. ఇక ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ ఉచిత బస్సు పాస్ లతో  5000 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు  లబ్ధి పొందినున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: