లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింహవాహిని అమ్మవారి ఆశీస్సులు అందరి పై ఉండాలని కోరుతూ ప్రత్యేకంగా పూజలు చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరమే ముఖ్యమంత్రి కెసిఆర్ బోనాల పండుగను రాష్ట్ర పండగగా గుర్తించారని అన్నారు. ప్రతి ఏడాది మొదట గోల్కొండ బోనాలతో ప్రారంభమవుతుందని, తర్వాత వారం సికింద్రాబాద్ బోనాలు జరిగాయని అన్నారు.
ఈ విధంగా ప్రతి సంవత్సరం బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అన్ని రకాల ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు రేపు రంగం కార్యక్రమం తర్వాత ఊరేగింపు కూడా ఉంటుందని తెలియజేశారు. ఈ యొక్క బోనాల పండుగకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి భక్తులు లక్షలాదిగా వస్తూ ఉంటారని తెలియజేశారు. ఈ సంవత్సరం మొదటిసారి ప్రయివేటు దేవాలయాలకి కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందని అన్నాడు. ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో విజయవాడలో కనకదుర్గమ్మని దర్శించుకోవడం జరిగిందని, ఢిల్లీలో కూడా బోనాల పండగ ను నిరవహిస్తున్నామని, తరతరాలుగా ఇది మన సంస్కృతి, దీనిని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. రెండు రోజుల జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
హైదరాబాదులోని అరిబోలిలో బంగారు మైసమ్మ అక్కన్న మాదన్న దేవాలయం, గౌలిగూడా దేవాలయంలో ఎక్కడ చూసిన అశేష జనవాహిని పాల్గొంటున్నారని,
కరోన వైరస్ 2 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న కోవిడ్ కు తగిన జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుందని, భక్తులకు మస్కులు శానీటైజర్లు అందిస్తున్నామని తెలిపారు. రాబోవు రోజుల్లో కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, అలాగే కరోనా వైరస్ తెలంగాణ మరియు దేశం ప్రపంచం మొత్తం అంతం కావాలని అమ్మవారిని వేడుకున్నాడు.