అదే పనిగా పోర్న్‌ వీడియోలు చూస్తే ఏమవుతుందో తెలుసా..?

Chakravarthi Kalyan
పోర్న్‌.. ఇప్పుడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఆధునిక సమస్య. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని ఇప్పుడు బూతు చిత్రాలు అందరికీ చేరువయ్యాయి. గతంలో ఓ బ్లూ ఫిలిం సంపాదించాలంటే నానా తంటాలు పడాల్సివచ్చేది. ఒకప్పుడు బూతు సినిమా చూడాలంటే.. కొన్ని థియేటర్లలోనే ఆడేవి. వాటిలోకి ఎవరూ చూడకుండా దూరి.. ఎవరైనా చూస్తారేమో అన్న భయంతో ఏ సర్టిఫికెట్ సినిమాలు చూసేవారు. ఇప్పుడు ఆ కష్టం లేదు.. స్మార్ట్ ఫోన్‌లో డేటా ఉంటే చాలు.. వందల కొద్దీ వీడియోలు అందుబాటులో ఉంటున్నాయి.

అందువల్ల ఈ పోర్ని చిత్రాలకు సహజంగానే యువత అట్రాక్ట్ అవుతున్నారు. యువతే కాదు.. చాలా మంది పెద్దలకూ ఈ పోర్న్‌ ఓ వ్యసనంగా మారింది. మరి..  అధికంగా పోర్న్‌ చూస్తే ఏమవుతుంది.. దీనివల్ల తలెత్తే సమస్యలేంటి..ఓ సారి చూద్దాం.. పోర్న్ వీడియోలు అదే పనిగా చూసే వారిలో విపరీతమైన లైంగిక ప్రవర్తనలు తలెత్తుతాయి. వీరు చిన్నారుల్ని, మహిళల్ని తమ కోరికలు తీర్చే లైంగిక వస్తువులుగా చూడటం ప్రారంభిస్తారు. ఇలాంటి పోర్న్ వీక్షణ పెరిగితే.. అది క్రమంగా అత్యాచారాలకు దారి తీస్తాయి కూడా.

అంతే కాదు.. పోర్న్ చూసేవారిలో మరికొన్ని అవలక్షణాలు బయలుదేరతాయి. వారు క్రమంగా అబద్ధాలు చెప్పడం మొదలుపెడతారు. అలాగే వారిలో మోసం చేసే ధోరణి కూడా క్రమంగా పెరుగుతుంది. ఇక పోర్న్ వీక్షణ ఎక్కువైతే.. వారు కోపానికి, కుంగుబాటుకు గురవుతుంటారు. ఇంకొందరైతే మాదకద్రవ్యాలకూ అలవాటు పడే ప్రమాదం ఉంది. మరికొందరు క్రమంగా నేరాల బాట పట్టే పడుతుంటారు.

పోర్న్ చూడటానికి అలవాటుపడ్డవారు మానసిక ఒత్తిడికిలోనవుతారు. తద్వారా మద్యానికి, మత్తుమందులకు బానిసలవుతుంటారు. మొదట్లో సరదాగా ప్రారంభమైనఈ పోర్న్ వ్యసనం ఆ తర్వాత కొత్తదనం కోసం తపిస్తుంది. అలా క్రమంగా విపరీతమైన ప్రవర్తన ఏర్పడుతుంది. ఇలాంటి వారే చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతుంటారు. అదే పెద్దలైతే జీవిత భాగస్వాములను హింసిస్తుంటారు. ఇలా పోర్న్‌ వీక్షణతో వచ్చే చిక్కులెన్నో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: