వైసీపీ కేబినెట్లో ఆ జిల్లాలో ఇద్దరు మంత్రులు సేఫే అట... !
ఇక కొందరు మంత్రులు మాత్రం తమ పదవులను నిలుపు కుంటారనే అంటున్నారు. ఈ లిస్టులో కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ జిల్లా నుంచి మొత్తం కేబినెట్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. వీరిలో వెల్లంపల్లి శ్రీనివాసరావు - కొడాలి నాని తో పాటు పేర్ని నాని కూడా మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మార్పులు, చేర్పులలో ఇద్దరు నానిలు సేఫ్ అని వైసీపీ వాళ్లే చెపుతున్నారు. బయట ప్రచారం మాత్రం ఈ సారి వంద శాతం మంది మంత్రులను మార్చేస్తామని చెపుతున్నా అది సాధ్యం కాదనే అంటున్నారు. జగన్కు ఇద్దరు నానిలు నమ్మిన బంట్లుగా ఉన్నారు. అందుకే వారిని జగన్ తప్పించరనే అంటున్నారు.
కొడాలి నాని విషయానికి వస్తే ఆ యన సామాజిక వర్గం అయిన కమ్మల నుంచి వైసీపీలో ఆయనే బలమైన నేత. జగన్పై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే రియాక్ట్ అవుతారు. అందుకే ఆయన పదవి సేఫ్. ఇక పేర్ని నాని కూడా కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్నారు. జగన్ పై వచ్చే విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే పేర్ని నాని వంటి వారిని కంటిన్యూ చేయక తప్పదని ఆ పార్టీ కీలక నేతలు భావిస్తున్నారట. అందుకే వీరిద్దరి పదవులకు వచ్చిన ఢోకా ఏం లేదని అంటున్నారు. మరి వీరి లక్ ఎలా ? ఉంటుందో ? చూడాలి.