మా కంటే గొప్పగా కాంగ్రెస్ ఏం చేయలేదు : కేసీఆర్

అసెంబ్లీ స‌మావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...భట్టి అద్భుతంగా చెప్పారని, వాళ్ళు అడగల్సిందే..మేము చేయాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. మంచిని అభినందిస్తూ ఉంటే ఎందరికో ఉత్సాహం వస్తదని...కానీ వాళ్ళు వారి సహజ దోరణి లోనే ఉన్నారన్నారు. సమస్య ఏంటంటే గతాన్ని విస్మరించి మాట్లాడొద్దని భ‌ట్టి విక్ర‌మార్క గ‌తాన్ని విస్మ‌రిస్తున్నార‌ని అన్నారు. 85 శాతం మొక్కలు బతికి ఉండాలని చెప్పాన‌ని కానీ ఇప్పుడు 90 శాతం మొక్కలు బతికి ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎక్కడైనా తక్కువ ఉంటే చెప్పాల‌ని సీరియస్ యాక్షన్ ఉంటదని చెప్పారు.

స్లీపింగ్ రిమార్క్ లు చేయొద్దని.. మా కంటే గొప్పగా కాంగ్రెస్ ఏం చెయ్యలేదు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. త‌మ‌ కంటే గొప్పగా చేసి త‌మ‌ను అంటే బాగుండేదని కేసీఆర్ చెప్పారు. ఇంతకు ముందు నిధుల కేటాయింపులో ప్లానింగ్ లేదని...గ్రామ పంచాయతీ లు మున్సిపాలిటీ లో చేరితే స్వాగతించాలని కేసీఆర్ అన్నారు. కానీ మన దగ్గర కోర్టులకు పోతరని చెట్లు పెంచండి అంటే వినలేద‌ని చెప్పారు. 2018 లో చట్టం చేశాక సర్పంచ్ కౌన్సిలర్, కమిషనర్ల ఉద్యోగాలు పోతాయి అని చెప్పాన‌ని... లోకల్ బాడీ లకు కలెక్టర్ లను పెట్టిన స్టేట్ తెలంగాణ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వక్ఫ్ బోర్డు భూముల విషయంలో సర్వే చేయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

అంతే కాకుండా దేవాదాయ , వక్ఫ్ బోర్డు భూముల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంటుందని చెప్పారు. అవసరమైతే సీబీ , సీఐడి కి భూముల కేసును అపగిస్తామ‌ని ముఖ్య‌మంత్రి మాటిచ్చారు. అంతేకాకుండా కేటీఆర్ మాట్లాడుతూ...67,500 కోట్ల తో హైదరాబాద్ లో అభివృద్ధి చేశామ‌ని చెప్పారు. ప్రతిపక్షాలు అభివృద్ధి చూడం అంటే మేము చేసేది లేదని..Srdp లోనే 6 వేల కోట్లు ఖర్చు చేశామ‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 132 కొత్త రోడ్లను అభివృద్ధి చేశామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు.  858 కోట్ల తో హైద‌రాబాద్ లో నాలా ల అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు.  రాజేంద్ర నగర్, ఉప్పల్ లాంటి శివారు లో ఇంటింటికీ నీళ్ళు ఇచ్చే పనిలో ఉన్నామ‌ని కేటీఆర్ అసెంబ్లీలో వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: