ఏపీ : బొగ్గు అగ్గి.. చల్లారేనా..!

Chandrasekhar Reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అడుగడుగునా సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. అవి కూడా ఒకదాని తరువాత ఒకటి వచ్చి పడుతుండటంతో ఊపిరి సలపనంతగా ప్రభుత్వం సతమతం అవుతుంది. ఇప్పటి వరకు విపక్షాల అర్ధం లేని విమర్శలతోనే సమస్యలు అంటుంటే, కరోనా వచ్చింది, అనంతరం వరదలు, తుఫాన్ లతో అల్లాడిపోయింది రాష్ట్రం. తాజాగా మరో సమస్య వచ్చిపడింది. ఇప్పుడు అదే ఆంధ్రాలో ప్రధానంగా చెప్పుకుంటున్న వార్త. అదే విద్యుత్ సంక్షోభం. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గు నిల్వలు అయిపోయాయి అనేది ఈ సమస్య. దీనితో ఆ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. అంటే ఇక అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ వాడకం కష్టం, ఉన్నదానిని అవసరాలకు సర్దాలి అంటే కోతలు తప్పవు.
ఒకపక్క ఉపఎన్నికలు, మరోపక్క విద్యుత్ సంక్షోభం, ఈ రెండు అధికార పార్టీ ఓటు పై ప్రధానంగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయనే భయం ఆ పార్టీలోనూ కనిపిస్తుంది. అందుకే విద్యుత్ వినియోగంలో ప్రజలకు సూచనలు ఇవ్వడంతో పాటుగా ఇతర మార్గాల ద్వారా బొగ్గును సమకూర్చుకునే పర్యటనలు యుద్ధప్రాతిపదికన చేస్తున్నాయి రాష్ట్ర వర్గాలు. ఇప్పటికే కేంద్రంలో కూడా ఈ సమస్య ఉందని వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో, అక్కడ ప్రభుత్వం కూడా ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బహిరంగంగా విద్యుత్ సంక్షోభం రావచ్చు అంటే ఓటు షేరింగ్ తగ్గే అవకాశం ఉంటుందనే ఆ విషయం పై స్పష్టత ఇవ్వకుండా ఇతర దేశాల నుండి దిగుమతి చేస్తూ, అవసరాలకు తగినట్టు అది కూడా సరిపోకపోయినా కూడా తగిన ప్రయత్నాలు అయితే చేస్తూపోతుంది.
అంటే బొగ్గు మంట అటు కేంద్రాన్ని, ఇటు ఆయా ఉపఎన్నికలు ఉన్న రాష్ట్రాలలో కూడా తీవ్రంగా రాజుకుంది. అయినా ఆయా ప్రభుత్వాలు దానిని ఏదో ఒకటి చేసి, మసిపూసి మారేడు కాయ చేయడానికి సంపూర్ణంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు టన్నుల బొగ్గు ఉత్పత్తి, సరఫరా అంటే అంత తక్కువ సమయంలో దిగుమతి కూడా సాధ్యం కానిపని. అందుకే చాపకింద నీరులాగా నిశబ్దంగా తమ పనులు తాము చేసుకుంటూ బొగ్గు హడావుడి తగ్గించడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: