బొగ్గు దిగుమతి.. రాష్ట్రాలకు చాలని వాటాలు..!
ఒకపక్క ఉపఎన్నికలు మరోపక్క ఈ విద్యుత్ సంక్షోభం, ఈ ప్రభావం ఆయా ప్రభుత్వాల ఓటు షేరింగ్ పై ఉంటుందనేది అందరి మదిలో ఉన్న సమస్యే. అందుకే ఈ విషయాన్నీ బాహాటంగా చెప్పడానికి ఇబ్బందిగానే ఉంటోంది కేంద్రానికి కూడా. బహుశా అందుకే విద్యుత్ సంక్షోభం ఏమి లేదు, అవన్నీ తప్పుడు వార్తలు అంటూ కొట్టిపడేస్తుంది. ఉన్న సమస్యను చెప్పకుండా పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. ఆయా రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో వ్యవహరించాల్సి వస్తుంది, కారణం ఎన్నికలే.
అయితే కేంద్రం మాత్రం బ్రిటన్ వంటి దేశాల నుండి బొగ్గు చేసుకుంటున్నప్పటికీ, అవసరాలకు తగ్గట్టుగా ఆ పరిమాణం సమకూరడానికి కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకు ఈ సమస్యను తొక్కి పెడితే, ఓటింగ్ సమయంలో ఇది గుర్తు రాకుండా చూసుకోవచ్చు అనేది ఆయా పార్టీల ఆలోచన లాగానే ఉంది. అందుకే ప్రజలకు మాత్రం ఏ సమస్య లేదు అని చెపుతున్నప్పటికీ, విద్యుత్ కోతలు కొన్ని చోట్ల తప్పట్లేదు. దీనితో విద్యుత్ సంక్షోభం వచ్చిందని ప్రజలలో అపోహలు మాదిరిగా అయినా ఈ విషయం బయటకు పొక్కుతుంది. కొన్నాళ్లు ఉంటె ఏ సమస్య అయినా తీరిపోవచ్చు, కానీ అప్పటి వరకు దానిని జాగర్తగా సమన్వయము చేయడం ద్వారా ఉపఎన్నికలలో ప్రభావం చూపకుండా చూస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు.