సంక్రాంతి తరువాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని అంతా భావిస్తే భావించవచ్చు.అది నిజం అయినా కాకపోయినా ఈ సారి జగన్ దృష్టిలో కొందరు అసమర్థ అమాత్యులకు సెలవు చెప్పాలి అని భావిస్తున్నారు అన్నది మాత్రమే నిజం కావొచ్చు.అదేవిధంగా సీనియర్ల పనితీరుపై మరోమారు ఓ స్పష్టతకు రావొచ్చు.అసలీ మంచుగాలులు వీస్తున్న వేళల్లో రాజకీయ రణ రంగం మరో మారు వేడెక్కి చల్లారనూ వచ్చు. అది కదా! కావాలి.అవును!జగన్ దృష్టిలో చాలా మంది అసమర్థ ఎమ్మెల్యేలూ,అసమర్థ ఎంపీలూ ఉన్నారు.వాళ్లను ఇప్పటికిప్పుడు మార్చలేరు కనుక వచ్చే ఎన్నికల్లో వారిని తప్పించడం ఖాయం.
అదేవిధంగా సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా జగన్ ఎక్కువగా సొంత సామాజికవర్గం రెడ్డితో సహా కాపు,యాదవ, కాళింగ సామాజకవర్గాలకు చేరువ అయ్యేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తా రు.అందులోభాగంగానే ఆయన కొన్ని వర్గాలను పిలిచి మరీ!నెత్తిన పెట్టుకుంటారు.ఇక దళిత వర్గాలు,మైనార్టీ వర్గాలు, క్రిస్టియానిటీకి చెందిన వర్గాలు ఎలానూ ఎప్పటి నుంచి కాంగ్రెస్ ను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ నే నమ్ముకుని ఉన్నాయి.కనుక జగన్ ప్రత్యేకించి వీళ్ల కోసం ఏమీ తాపత్రయపడనవసరం లేదు.మత్స్యకారులు లేదా అంతకన్నా చిన్న శ్రామిక వర్గాలు కూడా ఆయనతోనే ఉంటారని, అయితే పథకాల నిర్వహణ బాగుంటే ఓట్లు పడతాయని ఎప్పుడో తేలిపోయిన విషయమే!
జగన్ ఇప్పుడు క్యాబినెట్ లో కొన్ని మార్పులు తేవొచ్చు. మోపిదేవి లాంటి వారు సైడ్ అయిపోతామని అంటున్నారు కానీ అవన్నీ జరగని పనులు. అయితే క్యాబినెట్ నుంచి బూతుల మంత్రులను పక్కకు తప్పించి ఒకింత విశ్వసనీయత ఉన్న నాయకులకు చోటిచ్చేందుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వనున్నారు అని ఓ సమాచారం.విశ్లేషణ కూడా! కొడాలి నాని ఎప్పటి నుంచో జగన్ ఏం చెబితే అదే చేస్తానంటున్నారు కనుక ఆయనను తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు. అదేవిధంగా పౌర సరఫరాల్లో వచ్చిన ఆరోపణలు రుజువు చేసి చాకచక్యంగా ఆయనను తప్పించే ప్లాన్ కూడా ఉంది.
ఇక టికెట్ ధరలపై నోటికి వచ్చిందంతా వాగిన పేర్ని నానిని కూడా తప్పిస్తే తప్పించాలి. ఆయన వల్ల కూడా జగన్ కు డ్యామేజే! వీళ్లు కాకుండా ఆళ్ల నాని లాంటి వారిని కూడా తప్పిస్తే తప్పిస్తారు. కృష్ణ దాసుకు ఉద్వాసన తప్పదు. సీదిరి అప్పల్రాజు ను కూడా తప్పించేయడం ఖాయం. ఇలా కొన్ని సీట్లు తీసేసి బొత్స ను కూడా పీకేసి కొత్తగా కొన్ని స్థానాలు భర్తీ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఉంది.అందుకు శాసన మండలి నుంచి కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. ఆఖరులో అన్నీ బాగుంటే ప్రియ మిత్రుడు సజ్జలకో ఛాన్స్ ఇస్తే ఇవ్వవచ్చు.