ట్రోల్ బేబీ ట్రోల్ : రెక్కీ అబ‌ద్ధం రాజకీయం నిజం..!

RATNA KISHORE
కొడాలి నాని,వ‌ల్ల‌భ‌నేని వంశీ,వంగ‌వీటి రాధ అనే ముగ్గురు స్నేహితుల కార‌ణంగానే ఈ క‌థ అంతా నడిచిందా? లేదా అస్స‌లు ఈ క‌థ‌కు యూ ట‌ర్న్ ఇచ్చిందే వైసీపీనా? చంద్ర‌బాబు వ‌స్తే బెజ‌వాడ రాజ‌కీయాలు మారిపోతాయా?జ‌గ‌న‌న్న ఆలోచ‌న మేరకు రాధా న‌డుచుకుని మ‌ళ్లీ వైసీపీ గూటికి చేరిపోతారా?అంటే చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కు రాధా వెళ్ల‌కుండా,ప‌వ‌న్ పార్టీలోనూ చేర‌కుండా వైసీపీ ఆడిన డ్రామా ఈ రెక్కీనా? ఇవే ప్ర‌శ్న‌లు ప‌రిశీల‌కుల‌ను వేధిస్తున్నాయి.

ప్రశాంతంగా ఉన్న విజ‌య‌వాడ ప్ర‌శాంతంగానే ఉండాలి అని కోరుకోవ‌డం త‌ప్పు కాదు.ఆ విధంగా ఉండేందుకు పోలీసుకు పార్టీలు కూడా స‌హ‌క‌రించాలి.అయితే ఇటీవ‌ల జ‌రిగిన లేదా జ‌రుగుతున్న ప‌రిణామాల కార‌ణంగా అబ‌ద్ధాలే ఎక్కువ‌గా సోష‌ల్ మీడియా లో ట్రోల్ అవుతూ వాస్త‌వాలు ఏంట‌న్న‌వి మాత్రం తెలియ‌కుండా పోతున్నాయి. పోలీసులు చెబుతున్న ప్ర‌కారం సోష‌ల్ మీడియా లో ట్రోల్ అవుతున్న వీడియో రెండు నెలల కింద‌ట ఫుటేజ్ అని అయినా తాము ద‌ర్యాప్తును కొన‌సాగిస్తున్నామ‌ని, ప్రాణ హాని అన్న‌ది అవాస్త‌వం అని తేల్చేశారు.అంటే ఇది టీడీపీ డ్రామానా? లేకా వైసీపీ న‌డిపిస్తున్న డ్రామానా?

వీలున్నంత వ‌ర‌కూ రాధాను టీడీపీలోనే ఉంచి,వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిపించి త‌రువాత వైసీపీకి ర‌ప్పించి,అమాత్య ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాల న్న నియమంతో ఉంది వైసీపీ.ఇదంతా నిజం కాదు అని అనుకోలేం క‌దా!ప్ర‌స్తుతానికి అయితే ఇదంతా ఊహ‌జ‌నితం.ప్రాతిపాదిత రాజ‌కీయం ఏదీ జ‌ర‌గ‌కుండా ఉంటుంద‌ని అనుకోలేం.ఒక‌వేళ జ‌రిగిందే అనుకోండి అప్పు డు ఎమ్మెల్యే వంగ‌వీటి కాస్త మినిస్ట‌ర్ వంగ‌వీటి కానీ ఇంకా కాలం అనుకూలిస్తే డిప్యూటీ సీఎం వంగ‌వీటి కానీ అవ్వొచ్చు.కాకూడ‌ద‌ని రూలేం లేదు క‌దా!అందుక‌నో ఎందు క‌నో రెక్కీ విష‌యాన్ని పెద్ద‌గా మీడియాలో హైలెట్ అయినంత‌గా వైసీపీ స‌ర్కిల్స్ లో కాలేదు.ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తి అర‌వ స‌త్యం (దేవినేని అవినాశ్ అనుచ‌రు లు,విజ‌య‌వాడ న‌గ‌ర కార్పొరేష‌న్ ఫ్లోర్ లీడ‌ర్) ప్ర‌తినిధులు,కుటుంబ స‌భ్యులు త‌మ‌కేం పాపం తెలియ‌దనే అంటున్నారు.
విజ‌య‌వాడ పోలీసు బాస్ కాంతి రాణా టాటా కూడా రెక్కీకి ప‌క్కా ఆధారాలేవీ లేవ‌ని అంటున్నారు. మ‌రి!ఏమీ లేకుండా మంత్రు ల స‌మ‌క్షంలోనే త‌న‌పై రెక్కీ జ‌రిగిం ద‌ని,త‌న ఇంటి చుట్టూ కూడా కొంద‌రు గుర్తు తెలియ‌ని వారు చ‌క్క‌ర్లు కొట్టార‌ని రాధా ఆరోప‌ణ లు చేస్తున్న‌దెందుకు? ఈ వివాదం త‌న‌కు ప‌నికి వ‌స్తుందా లేదా అన్న ఆలోచ‌నకు బాబు ఎందుకు వ‌చ్చారు అని?
బెజ‌వాడ పోలీసు చెబుతున్న ప్ర‌కారం రెక్కీ అబ‌ద్ధం.వంగ‌వీటి రాధ చెబుతున్న ప్ర‌కారం రెక్కీ నిజం.టీడీపీ చెబుతున్న ప్ర‌కారం కూడా రెక్కీ నిజం.అలాంట‌ప్పుడు ఏది నిజం అన్న‌ది తేల్చాలి క‌దా!పోలీసులు మాత్రం రాధా ప్రాణాల‌ను కాపాడ‌డం త‌మ బాధ్య‌త అని చెబుతున్నారు.త‌మ‌తో  పాటు  మ‌రికొన్ని ద‌ర్యాప్తు బృందాలు కూడా రంగంలోకి దిగాయ‌ని కానీ రెక్కీకి సంబంధించి ఎటు వంటి ఆధారం త‌మ‌కు చిక్క‌లేద‌ని విజ‌య‌వాడ సీపీ చెబుతున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: