వింటున్నావా జ‌గ‌న్ : విధ్వంసం వ‌ద్దు వికాసం కావాలి..!

RATNA KISHORE
నేల‌ను కాపాడుకుందాం
అని చెప్ప‌డం నినాదం
కానీ ప్ర‌భుత్వాల‌కు అదొక వివాదం
ఇవాళ వివేకానందుని జ‌యంతి
ఆ రోజు ఆయ‌న సైన్సుకు మాన‌వ‌త‌ను
జోడించండి అని చెప్పారు..కానీ ఇప్పుడు?


విధ్వంసం వ‌ద్దు అని చెప్ప‌డం ఇవాళ వివేకానందుడికి మ‌నం ఇచ్చే నివాళి..విధ్వంసం వద్దు అని చెప్పి మ‌ళ్లీ అటు ఆలోచించ‌కుండా ప్ర‌కృతి వ‌నరుల‌ను కొలిచి మొక్క‌డం ఇవాళ వివేకానందుడికి ఇచ్చే నివాళి..ఇవేవీ కాకుండా మ‌నం కేవ‌లం ఆ విగ్ర‌హానికి దండ‌లు వేసి మొక్కులు మొక్కితే ఫ‌లితం ఉండ‌దు. ఫ‌లితం లేని ప‌నుల కార‌ణంగా జీవితం చిన్న‌బోతుంది. ప్ర‌కృతి చిన్న‌బోతుంది.ప్ర‌కృతి మ‌రియు ప్ర‌కృతి ఆధారిత జీవితం రెండూ కూడా చిన్న‌బోతాయి. క‌నుక మ‌నం అభివృద్ధి పేరిట తీసుకువ‌స్తున్న వినాశ‌నాన్ని వ‌ద్ద‌నుకోవాలి. కానీ మ‌న ఊళ్ల‌లో జ‌రుగుతున్న అభివృద్ధిని ఒక్క‌సారి చూడండి ఎన్ని వేల ఎక‌రాల్లో విధ్వంసం య‌థేచ్ఛ‌గా అమలవుతోందో!


శ్రీ‌కాకుళం విష‌యానికి వ‌స్తే అభివృద్ధి అంటూ కొవ్వాడ న్యూక్లియ‌ర్ ప్లాంటు తెచ్చారు. దాని వ‌ల్ల ఏం లాభం? వ‌ద్ద‌ని అంటే ఆ భూములు ఇప్పుడు ఆక్వా క‌ల్చ‌ర్ కు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి.ఇది కూడా విధ్వంస‌మే! కానీ మనం వీటిని ప‌ట్టించుకోం. వ‌ద్ద‌ని అంటే కోపం.. ఔన‌ని అంటే అంతా ప్ర‌శాంతం..ఇదే కాదు ఇవాళ అమరావ‌తి అంటూ ఒక‌రు విశాఖ అంటూ ఒక‌రు డ్రామా నడుపుతున్నారు..ఇందులో విధ్వంసం త‌ప్ప ఏం ఉంద‌ని?


మూడు పంట‌లు పండే నేల‌ల్లో ఆకాశ హ‌ర్మ్యాల నిర్మాణం వ‌ద్దేవ‌ద్ద‌ని అంటున్నా వినిపించుకోలేదు ఆ రోజు..ఇప్పుడు విశాఖ‌లో రిషి కొండ దారుల్లో విప‌రీతంగా మ‌ట్టి త‌వ్వేసి హాయిగా ప‌బ్బం గ‌డుపుకుంటున్నారు. ఇదీ విధ్వంస‌మే! అదేవిధంగా గోదావ‌రి చెంత జ‌రుగుతున్న ప‌ర్యావ‌ర‌ణ విధ్వంసం పైనా మాట్లాడిన వారెవ్వ‌రూ లేరు..ఆక్వా క‌ల్చ‌ర్ సంబంధిత ఉత్ప‌త్తుల త‌యారీ కార‌ణంగా తుందుర్రు ప‌రిస‌ర ప్రాంతాల్లో నేల సారం పూర్తిగా పోతోంది..మోతాదుకు మించి ర‌సాయ‌నాల వాడ‌కం కార‌ణంగా భూ గ‌ర్భ జ‌లాలు పూర్తిగా క‌లుషితం అయిపోతున్నాయి.. అయినా వీటిపై ఎవ్వ‌రూ మాట్లాడ‌రు..క‌నుక విధ్వంసం వద్దు విధ్వంసం లేని అభివృద్ధి ముద్దు అని చెప్ప‌డం మ‌రువొద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: