జగనన్న : మొన్న పే స్లిప్పు నిన్న టంగు స్లిపు..జూ లకటక
ఫలితంగా జగన్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం అని విపక్షం అంటోంది
ఇవన్నీ ఎలా ఉన్నా ఉద్యోగులు చేస్తున్నదంతా రైటేనా!
ఇవన్నీ ఎలా ఉన్నా ఇప్పటికిప్పుడు సజ్జల ను జగన్ తప్పించరు కానీ ఉద్యోగులే వాగుడు తగ్గించి ఉద్యమంలో మంచి భాష వాడితే మేలు అన్న వాదన కూడా వినిపిస్తోంది. కానీ ఉద్యోగులు ఇవేవీ వినిపించుకునే స్థితిలో లేరు.
విజయవాడలో ఉద్యమం సక్సెస్ అయింది.చలో విజయవాడ పేరిట చేసిన నిరసన అంతా బాగుంది.వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి కానీ ఇప్పటికప్పుడు ఏవీ మారబోవని కూడా చెబుతున్నాయి.ఈ తరుణాన సమస్య ఎలా పరిష్కారానికి నోచుకుంటుందని! జగన్ మాత్రం ఒక్క మెట్టు కూడా దిగననే అంటున్నారు. ఆ సలహాలు ఇచ్చినోళ్లు కూడా అలానే ఆయన పంతం నెగ్గాలనే అంటున్నారని సమాచారం.ఇంకేం ఉపాధ్యాయులు రోడ్డెక్కితే మరి బడి పాఠాలు ఏమౌతాయి? ఇదే ఇప్పుడు పెద్ద చిక్కు ప్రశ్నగా మారింది.
త్వరలో సమ్మెకు వెళ్తామని అంటున్నారు.అంటే వీళ్లు ఇక పనిచేయరు అని తేలిపోయింది.అలాంటప్పుడు క్షమశిక్షణా చర్యలు తీసుకుంటారా? ఓ వైపు రాష్ట్రం అప్పుల్లో ఉందని అంటున్నప్పుడు సంక్షేమానికి నిధులు యాడ నుంచి తెస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు.దీంతో జగన్ కూడా మరో మారు డైలమాలో పడిపోయారు.మారు వేషాల్లో వచ్చిన ఉద్యోగులు అప్పుడు ముద్దులు ఇప్పుడు గుద్దులు అంటూ పాటలు పాడారు. ఏయ్ బిడ్డా ఇది మా అడ్డా అని కూడా పాడారు. ఇవన్నీ ఎందుకు ? ఎందుకంటే జీతంలోఅనూహ్యం అయిన తగ్గుదల వస్తుంది కనుక!