కేసీఆర్ VS బండి : సర్జికల్ స్ట్రైక్ పాలిటిక్స్ వర్కౌట్ అవుతాయా ?
సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నంబర్ వన్ అవినీతి పరుడు కేసీఆర్ అని.. నువ్వు సీఎం అయ్యాక ఒక రోజంతా నిన్ను సీబీఐ విచారణ చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు బండి సంజయ్. ని పర్సనల్ సెక్రటరీ గా ఉన్న దిలీప్ కుమార్ కేసీఆర్ పై అపరిచితుడు అనే పుస్తకం రాసాడని.. కేసీఆర్ కి కమిషన్ లు రావడం లేదు అందుకే అసహనమని నిప్పులు చెరిగారు బండి సంజయ్. అన్ని లబ్ది దారులకు నేరుగా చేరుతుండడం తో నాకేంటి అనే బాధ ఆయనలో ఉందని.. విద్యుత్ సంస్కరణల పై కేసీఆర్ బట్టేబాజ్ మాటలు మాట్లాడారు.. అన్ని అబద్ధాలేనని నిప్పులు చెరిగారు బండి సంజయ్. వ్యవసాయ మోటర్లకు మీటర్లు అవసరం లేదని జనవరి 3... 2022 న అన్ని రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్ పంపించిందని..ఎంపీ లు పార్లమెంట్ లో ఏమి పీకుతున్నారన్నారు బండి సంజయ్.