బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన తప్పేంటీ, సభకు ఇబ్బంది పెట్టలేదని.. ముందస్తుగా ప్లాన్ చేసుకుని బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఏ కారణంగా లేకుండా సస్పెండ్ చేశారని.. గవర్నర్ ను శాసనసభకు ఆహ్వనించకుండా అవమానించిన చరిత్ర టీఆర్ఎస్ ది అని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. న్యాయపరంగా కొట్లాడతాం... ప్రజల మధ్య నిరసనలు తెలుపుదామని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మా సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని.. నియంత పాలన కొనసాగనివ్వమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ... పోయో ప్రభుత్వానికి అబద్దాలు ఎక్కువ అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే రోజంతా గడిచిపోయింది... అని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గతం లో అకారణంగా రేవంత్ రెడ్డి ని కూడా సస్పెండ్ చేశారని.. కేంద్రాన్ని తిడుతుంటే trs ఎమ్మెల్యేలు రాక్షస ఆనందం పొందారని మండిపడ్డారు. గతంలో 270 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఆ తరవాత ఎన్నికల్లో తూడుచుకుపోయిందని.. తెలంగాణ లో కల్వకుంట్ల రాజ్యాంగం కుదరదని అగ్రహించారు. బడ్జెట్ నేతి బీరకాయ లో నెయ్యి లాగా ఉంది.. ఇది అబద్దాల బడ్జెట్ అని అగ్రహించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గత బడ్జెట్ లో కేటాయించింది ఎంత ఖర్చు చేశావో స్పష్టం చేయాలి...హరీష్ రావు అబద్ధాల మంత్రి అని ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పార్లమెంట్ లో ఎన్ని రోజులు అడ్డుకున్నారు.... పోడియం దగ్గర ఆందోళన చేశారు.. trs సభ్యులు కూడా లోక్ సభలో ఆందోళన చేశారు... సస్పెండ్ చేశారు.. కేసీఆర్ కె అసెంబ్లీ లో కూర్చునే అధికారం లేదన్నారు.