మమతతో ఆ మాటలు పీకే చెప్పించారా?

Chakravarthi Kalyan
పెగాసస్ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. పెగసస్‌ స్పైవేర్ గతంలోనే చాలా వివాదాస్పదం అయిన సంగతి తెలుసు. కేంద్రం ఈ సాఫ్ట్‌వేర్‌తో దేశంలోని కీలక నేతల ఫోన్లు టాప్ చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా  ఈ వివాదాస్పద పెగసస్‌ స్పైవేర్‌ను 4 ఏళ్ల క్రితమే అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు కొన్నారని ఇప్పుడు బెంగాల్ సీఎం మమత షాకింగ్ కామెంట్స్ చేయడం రాజకీయంగా కలకలంరేపింది. చంద్రబాబు ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ  ప్రకటించడం సంచలమైంది.

అయితే.. ఇప్పుడు ఈ అంశాన్ని టీడీపీ అనుకూల మీడియా మరో కోణంలో ప్రజంట్ చేస్తోంది. అసలు మమత ఇప్పుడు ఈ అంశాన్ని ఎందుకు బయటపెట్టారని ప్రశ్నిస్తోంది. ఇదంతా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ ప్లాన్‌లో భాగమేనని అప్పుడే కథనాలు వండి వారుస్తోంది. అంతే కాదు.. ఏకంగా కపట మమత అంటూ మమతా బెనర్జీపై విమర్శలకు తయారయ్యింది. అవకాశం ఉంది కదా అని ప్రశాంత్ కిషోర్‌ కు ఈ వ్యవహారం అంటకట్టేసింది. చంద్రబాబు ఎక్కడ విమర్శల పాలవుతారో అన్న భయం ఆయన అనుకూల మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది.  

ఇటీవలమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ ఈ పెగాసస్ పై షాకింగ్ కామెంట్సే చేశారు. ఈ పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు అందిస్తామంటూ బెంగాల్‌లోని తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని మమత అన్నారు. కానీ ఈ పెగసస్ ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించినదని.. అందుకే తాను కొనలేదని మమత చెప్పుకొచ్చారు. ఇది చట్ట విరుద్ధం కూడా కావడం వల్ల అప్పట్లో తాము కొనలేదని మమత అంటున్నారు.

మొత్తం మీద ఇప్పుడు ఈ వ్యవహారం చంద్రబాబు మెడకు చుట్టుకుంటోంది కాబట్టి వెంటనే ఆయన అనుకూల మీడియా రంగంలోకి దిగింది. ఇక ఈ పెగసస్ వ్యవహారం 2017లో జరిగిన వ్యవహారం.. అప్పట్లో పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ను భారత ప్రభుత్వం 2 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిందని న్యూయార్క్‌ టైమ్స్‌లో ఓ కథనం వచ్చింది. అదే దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: